ETV Bharat / entertainment

'గేమ్​ఛేంజర్' ట్రైలర్ రిలీజ్- ఇక థియేటర్లు బ్లాస్టే! - GAME CHANGER TRAILER

'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజ్- మీరు చూశారా?

Game Changer Trailer
Game Changer Trailer (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2025, 5:48 PM IST

Game Changer Trailer : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ గురువారం రిలీజైంది. హైదరాబాద్​ కొండాపూర్ AMB సినిమాస్​లో ఈవెంట్ నిర్వహించిన మేకర్స్​ ఈ ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్​గా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. 2.40 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మీరు చూశారా?

'కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు, ఒక్క ముద్ద వదిలేస్తే దానికొచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ, ఆ ఒక్క ముద్ద లక్ష చీమలకు ఆహారం. నేను అడిగేది ఆ ఒక్క ముద్ద మాత్రమే' అంటూ ట్రైలర్ ఆసక్తిగా ప్రారంభమైంది. ఒక ఐఎయస్ ఆఫీసర్- రాజకీయ నాయకుడి మధ్య గొడవే ఈ సినిమా కాన్సెప్ట్​గా అర్థమవుతోంది. హీరో చరణ్ కాలేజీ స్టూడెంట్, కలెక్టర్, పోలీస్, రాజకీయ నాయకుడుగా పలు గెటప్స్​లో కనిపించారు. అక్కడక్కడా రామ్​చరణ్ మేనరిజం ఆకట్టుకుంది.

కమెడియన్లు సునీల్, బ్రహ్మనందం, వెన్నెల కిషోర్​ను కూడా ట్రైలర్​లో చూపించారు. విజువల్స్​ కూడా నెక్ట్స్ లెవెల్​లో ఉన్నాయి. యస్ జే సూర్య- హీరో మధ్య జరిగే పొలిటికల్ వార్ సినిమాలో​ హీట్​ పెంచేలా ఉంది. ఒక కలెక్టర్ హోదాలో ఏకంగా ముఖ్యమంత్రిన 'రా' అని సంభోదించిన సీన్​ ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉంది. ఇక రామ్​చరణ్​ చివరగా లుంగీ గెటప్​లో హెలికాప్టర్​లోంచి కత్తి పట్టుకొని దిగుతూ ఊర మాస్​గా చూపించారు. ఈ సీన్​కు థియేటర్లు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ​

కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించింది. నటి అంజలీ, సీనియర్ నటుడు యస్​ జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.

పాటలకే రూ.75 కోట్లు- 'గేమ్ ఛేంజర్' సాంగ్స్​ ఒక్కోటి ఒక్కో లెవెల్​

256 ఫీట్ల రామ్​చరణ్​ భారీ కటౌట్- మెగా ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.