Ram Charam On SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ప్రాజెక్ట్ 'SSMB 29' (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా గురువారం అధికారికంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. అయితే 'బాహుబలి' తర్వాత రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడేళ్లు పడుతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీంతో ఈ సినిమాకు కూడా రాజమౌళి మూడేళ్లు సమయం తీసుకోవచ్చని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాపై మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ మాట్లాడారు. ఈ సినిమా ఒకటిన్నర సంవత్సరంలోనే వస్తుందని అన్నారు.
హైదరాబాద్ AMB సినిమాస్‌లో రామ్‌చరణ్ లేటెస్ట్ మూవీ 'గేమ్‌ఛేంజర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్‌కు దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ, SSMB ప్రాజెక్ట్ గురించి హీరో రామ్‌చరణ్‌ను అడిగారు. 'ఈ సినిమా ఎప్పుడు విడుదల కావచ్చో అంచనా వేయండి' అని అన్నారు. దీనికి చరణ్ 'కొవిడ్ లాంటివి లేకపోతే, మరో ఒకటిన్నర సంవత్సరంలోనే ఈ సినిమా వస్తుందని నేను గట్టి నమ్మకంతో ఉన్నా' అని ఫన్నీగా అన్నారు. దీనికి రాజమౌళి చెర్రీ దగ్గరకు వచ్చి 'బాగా ట్రైనింగ్ ఇచ్చా' అని అన్నారు. దీంతో అందరూ నవ్వుకున్నారు.
#SSMB29 Will Arrive In 1 and half Years 🔥 @AlwaysRamCharan #SSMBxSSRGloryBegins #MaheshBabu pic.twitter.com/uGhGtT4lWQ
— SSMB DEVOTEE (@Ssmb_Devoteee) January 2, 2025
దానికి నా పర్మిషన్ తీసుకోవాలి
ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాజమౌళి, రామ్‌చరణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'మగధీర సమయంలో చరణ్‌ను నేను హీరో అని పిలిచేవాడిని. చరణ్ అని పిలవడం తనకు ఇష్టం ఉండదు రామ్ అంటేనే ఇష్టం. చరణ్ గుర్రపు స్వారీ సీన్స్ అన్నింటికీ నావే హక్కులు. ఆ సన్నివేశాలు చేయాలంటే నా అనుమతి తీసుకోవాల్సిందే. ఇక శంకర్ సర్ సినిమాల్లో 'ఒకే ఒక్కడు' నా ఫేవరెట్. ఇప్పుడు గేమ్‌ఛేంజర్ దాన్ని మించి ఉంటుంది అనిపిస్తుంది' అని అన్నారు.
కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించింది. అంజలీ, యస్ జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.
'గేమ్‌ఛేంజర్' ట్రైలర్ రిలీజ్- ఇక థియేటర్లు బ్లాస్టే!
పాటలకే రూ.75 కోట్లు- 'గేమ్ ఛేంజర్' సాంగ్స్ ఒక్కోటి ఒక్కో లెవెల్