Karthikeya Bhaje Vaayu Vegam Movie :యంగ్ హీరో కార్తికేయ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భజే వాయు వేగం'. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ గత శుక్రవారం ( మే 31)న థియేటర్లలో విడుదలైంది. అయితే దీంతో పాటు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'గం గం గణేశా' సినిమాలు రిలీజవ్వడం వల్ల కార్తికేయ మూవీకి గట్టి పోటీ నెలకొంది.
మూడింటికీ భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది. కానీ మిగతా రెండు సినిమాలు మాత్రం ప్రస్తుతం యావరేజ్ టాక్‌తోనే నడుస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం 'భజే వాయువేగం' ప్రస్తతుం సక్సెస్ టాక్ అందుకునే దిశగా వెళ్తోంది. మౌత్ టాక్ వల్ల ఈ చిత్రానికి క్రేజ్ ఏర్పడిందని, దీంతో మూవీ లవర్స్ ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ యాక్టింగ్ కూడా బాగుందని, ఈ సమ్మర్ విన్నర్ ఈ సినిమానే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
స్టోరీ ఏంటంటే?
వరంగల్ సమీపంలోని రాజన్నపేటకు చెందిన కుర్రాడు వెంకట్ (కార్తికేయ). తల్లిదండ్రులు వ్యవసాయంలో నష్టాలు రావడం వల్ల అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో అనాథైన వెంకట్‌ను తండ్రి స్నేహితుడు లక్ష్మయ్య (తనికెళ్ల భరణి) చేరదీసి, తన కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో పాటు చూసుకుంటుంటాడు. క్రికెటర్ అవ్వాలన్న లక్ష్యంతో వెంకట్, మంచి ఉద్యోగం సంపాదించాలన్న కోరికతో రాజు ఊరి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటాడు. కానీ, కొందరు చేసిన కుట్రల వల్ల అనుకున్న లక్ష్యాల్ని ఆ ఇద్దరూ చేరుకోలేకపోతారు. దీంతో వెంకట్ క్రికెట్ బెట్టింగ్స్ వేస్తూ, రాజు ఓ స్టార్ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు.