Emergency Movie Censor Certificate:బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' సినిమా సెన్సార్ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే సెన్సార్ బోర్డు సినిమాలోని పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా సీన్స్‌ను తొలగించడమో లేదా వాటి స్థానంలో కొత్తవి యాడ్ చేయాలని మూవీయూనిట్కు సెన్సార్ బోర్డు సూచించింది.
అందులో బంగ్లాదేశ్ శరణార్థులపై పాకిస్థాన్ సైనికులు దాడి చేయడం, ఓ చిన్నారి, ముగ్గురు మహిళలను శిరచ్ఛేదం చేయడం వంటి సన్నివేశాలను మార్చాలని చెప్పింది. ఇక భారత మహిళలను కించపరిచేలా నిక్సన్ పాత్ర చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, బంగ్లాదేశ్ శరణార్థులు, కోర్టు తీర్పుల సమాచారం ఎక్కడిది? 'ఆపరేషన్ బ్లూస్టార్' ఫుటేజీ అనుమతికి సంబంధించి కొన్ని వివరాలు కోరింది.
అయితే ఈ సినిమాలో తమను తప్పుగా చూపించారని ఓ వర్గం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అయ్యింది. దీనిపై కంగన బాంబే హై కోర్టును సైతం ఆశ్రయించారు. అయినప్పటికీ ఆమెకు బాంబే హై కోర్టులో ఊరట లభించలేదు. 'సర్టిఫికేట్ విషయంలో సెన్సార్ బోర్డును ఆదేశించలేం' అని బాంబే కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ విషయంలో ఈనెల 18లోపు ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెన్సార్ తాజాగా అప్రువల్ ఇచ్చింది.