Akhanda 2 Heroine : నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్లో డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా 'అఖండ 2: తాండవం'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్గా ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ మేళాలో ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. తాజాగా మేకర్స్ సినిమాలో నటించనున్న హీరోయిన్ పేరును అనౌన్స్ చేశారు. యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ 'అఖండ 2'లో నటించనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
'టాలెంటెడ్ నటి సంయుక్తకు అఖండ 2 ప్రాజెక్ట్‌లోకి స్వాగతం. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది' అని మేకర్స్ పోస్ట్ చేశారు. కాగా, ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, నందమూరి తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా, వరుస హిట్లుతో దూసుకెళ్తున్న టాలీవుడ్ యంగ్ లక్కీ చార్మ్ సంయుక్త మీనన్ కోసం బోయపాటి శక్తివంతమైన మహిళా పాత్రను రాసినట్లు తెలుస్తోంది. కాగా, అఖండ-2లో ప్రగ్యాతో పాటు సంయుక్తకు కూడా సందడి చేయనున్నారు.
The talented and happening @iamsamyuktha_ is on board for #Akhanda2 - Thaandavam ✨
— 14 Reels Plus (@14ReelsPlus) January 24, 2025
Shoot in full swing 💥
Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus @RaamAchanta… pic.twitter.com/Snr685kUl7
హిట్ కాంబోలో నాలుగో సినిమా
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రం అఖండ-2. వీరి కాంబోలో ఇప్పటికే 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు తెరకెక్కి భారీ హిట్లు కొట్టాయి. దీంతో ఈ సినిమాను దర్శకుడు బోయపాటి ఫుల్ యాక్షన్, బలమైన డ్రామా మేళవింపుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.
అఖండకు సీక్వెల్!
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పకురాలు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సంచలన విజయం సాధించిన 'అఖండ'కి దీటుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా 2025 సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హ్యాట్రిక్ హిట్స్
నట సింహం బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన 'డాకు మహారాజ్' మూవీ జనవరి 12న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' తర్వాత బాలయ్యకు వరుసగా నాలుగో హిట్. వరుస విజయాలతో జోరు మీదున్న బాలయ్య 'అఖండ-2' తో విజయపరంపర కొనసాగించాలని భావిస్తున్నారు.
మహా కుంభమేళాలో 'అఖండ 2' టీమ్ - కోట్లాది భక్తుల మధ్యలో షూటింగ్
'డాకు మహారాజ్' కాసుల వర్షం- 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి