IMDB Most Popular Indian Stars :ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ ఏడాదిలో ఆ పోర్టల్‌లో ఎక్కువగా సెర్చ్ జరిగిన హీరో-హీరోయిన్ల లిస్ట్‌ను ఈ మేరకు ప్రకటించింది. అందులో టాప్ వన్ పొజిషన్లో త్రిప్తి డిమ్రీ నిలిచారు. ఈ ఏడాది ఆమె నటించిన 'బ్యాడ్ న్యూజ్' అలాగే 'లైలా మజ్ను' రీరిలీజ్‌తో పాటు 'భూల్ భులయ్యా3' సినిమాలు విడుదలవ్వడం వల్ల తన పేరు పాపులర్ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఈ లిస్ట్‌లోని రెండు ప్లేస్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఉంది. ఇక మూడు స్థానంలో షాహిద్ కపూర్ సోదరుడు యంగ్ హీరో ఇషాన్ ఖత్తర్ ఉన్నారు. నాలుగో పొజిషన్‌ను బీటౌన్ బాద్షా షారుక్ ఖాన్ నిలిచారు.
మరోవైపు టాప్ 5లో స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ కూడా ఉన్నారు. నాగచైతన్యతో పెళ్లి, అలాగే ఆమె నటించిన 'మంకీ మ్యాన్' విడుదల నేపథ్యంలో ఆమె ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచారు. ఇక ఆరు, ఏడు స్థానాలను శార్వరీ వాఘ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఉన్నారు.