తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పాలిటిక్స్​ ఎంట్రీపై అల్లు అర్జున్​ క్లారిటీ - ఏం అన్నారంటే? Source ANI - Alluajrun Politics - ALLUAJRUN POLITICS

Alluarjun Politics Entry : వివాదస్పదమైన తన నంద్యాల పర్యటనపై ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడారు. అలానే తాను పాలిటిక్స్ ఎంట్రీపై కూడా మాట్లాడారు. ఏం అన్నారంటే?

Source ANI
Alluarjun (Source ANI)

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 10:30 AM IST

Alluarjun Politics Entry :రాజకీయాలకు ఎప్పుడూ కొంచెం దూరంలోనే ఉంటారు ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్. అయితే ఈసారి అన్యూహంగా తన స్నేహితుడు నంధ్యాల వైకాపా ఎమ్మెల్యే అభ్యర్ధి రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం నంధ్యాలలో పర్యటించారు. అయితే తన కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఉంటూ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కొంత మంది ఫ్యాన్స్​ను అసహనానికి గురి చేసింది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్​పై కాస్త నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

అయితే తాజాగా ఈ విషయమై హైదరాబాద్ ఫిలిమ్​నగర్​లో తన ఓటు హక్కుని వినియోగించుకుని బయటకు వచ్చిన అల్లు అర్జున్​ను మీడియా చుట్టుముట్టి అడిగింది. దీనికి సమాధానంగా ఆయన తన స్నేహితుడి గెలుపు కోసమే నంధ్యాల పర్యటన చేశానని సృష్టం చేశారు. యాక్టివ్ రాజాకీయాల్లోకి ఎంట్రీ గురించి మరో ప్రశ్న వేయగా మొదట చిరునవ్వు నవ్వి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పారు.

"నాకు ఏ పాలిటిక్స్ పార్టీతో సంబంధం లేదు. నా వరకు అన్ని పార్టీలు ఒక్కటే. నాకు సంబంధించిన వారు ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా నా సపోర్ట్ ఉంటుంది. మా మావయ్య పవన్‌ కల్యాణ్‌కు నా పూర్తి మద్దతు. అది ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో రవికి కూడా అలాగే సపోర్ట్ ఇచ్చాను. శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా స్నేహితుడు. బ్రదర్‌ మీరెప్పుడైనా పాలిటిక్స్​లోకి ఎంట్రీ ఇస్తే, మీ ఊరు వచ్చి సపోర్ట్‌ చేస్తాను అని మాటిచ్చాను. అలానే 2019లో ఆయన పాలిటిక్స్​లోకి వచ్చాక వెళ్లి కలవలేకపోయాను. అందుకే ఈసారి ఇచ్చిన నిలబెట్టుకోవాలనుకున్నాను. ఒక్కసారైనా వెళ్లి కనపడాలని నా మనసులో అనుకున్నాను. అలా ఈసారి ఆయన ఎలక్షన్స్​లో పోటీ చేస్తున్నారని తెలిసి, నేనే స్వయంగా ఫోన్‌ చేసి మరీ వస్తానని చెప్పాను. అందుకే నా భార్యతో కలిసి నంద్యాలకు వెళ్లి పర్యటించాను. పర్సనల్​గా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు ఏమాత్రం లేదు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను" అని అల్లు అర్జున్‌ అన్నారు.

టాలీవుడ్‌లో పీరియాడిక్‌ జోరు - Tollywood Periodic films

'ఒక్క ఓటు' విలువ - విజయ్​​ దళపతి ఎంత గొప్పగా చెప్పారో చూడండి! - Vijay Thalapahy Vote Value

ABOUT THE AUTHOR

...view details