Allu Arjun Received Gift:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బన్నీ తన పర్సనల్, సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి ఓ పుస్తకాన్ని గిఫ్ట్‌గా పంపారంటూ ఆయన పేర్కొన్నారు.
'గుర్తు తెలియని ఒక వ్యక్తి నాకు ఈ పుస్తకాన్ని పంపించారు. అతడి నిజాయితీ, నాపై చూపించిన చొరవతో మనసు నిండింది. ఒక పుస్తక ప్రియుడిగా నాకు ఇది ఆనందాన్ని కలిగించింది. దీనిని రచించిన సీకే ఒబెరాన్‌కు ఆల్ ది బెస్ట్' అని పేర్కొన్నారు. ఈమేరకు ఆ వ్యక్తి పంపిన 'Burned Beneath the Fire of Desire' అనే పుస్తకం ఫొటోను షేర్ చేశారు.
కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప- 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పాటలు, గ్లింప్స్‌కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తోంది. 2021 బ్లాక్‌బస్టర్ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా డైరెక్టర్ సుకుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి పార్ట్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సీక్వెల్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక డిసెంబర్ 6న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.