Heroine Pranitha Subhash Bath tub Video :హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ బాపుబొమ్మగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట్లో మరోసారి ట్రెండింగ్‌గా మారింది. బాత్ టబ్ స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే - అత్తారింటికి దారేదితో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన బాపుగారి బొమ్మ ప్రణీత దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమెకు రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమకోసమే చిత్రాలు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కరోనా సమయంలోనూ పేదల కోసం తనవంతు సాయం చేయడంతో ఆమెపై మరింత గౌరవాన్ని పెంచింది. అనంతరం సినిమా ఆఫర్లు కాస్త తగ్గిన సమయంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్‌లో సెటిల్ అయిపోయింది.
Heroine Pranitha Subhash Movies :అయితే ప్రణీతకు ప్రస్తుతం తెలుగులో సినిమా ఆఫర్లు అంతగా రావడం లేదు. కన్నడ, హిందీలో అడపాదడపా చిత్రాలు చేస్తోంది. ఒకప్పుడు ఇక్కడ ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా చాలా సినిమాల్లోనే కనిపించి మెప్పించింది. ఆమె అందానికి తెలుగు కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు. కానీ ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో ప్రణీత ప్రస్తుతానికి బుల్లితెరపై సందడి చేస్తోంది. పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.