GHMC Commissioner On Tender process In Hyderabad : నిధులు పూర్థి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా కమిషనర్ ఇలంబర్తి ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉత్తర్వు ప్రకారం టెండరు ప్రక్రియ పూర్తయిన రెండేళ్లకు కూడా మొదలుకాని పనులు వాటంతట అవే రద్దయిపోతాయి. ఇంజినీర్ల మద్దతుతో కొందరు గుత్తేదారులు ఏళ్ల తరబడి పనులు ప్రారంభించకుండా ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారిపై ఈ నిర్ణయం చెంపపెట్టులాంటిది.
కనీసం 80 శాతం ప్రజలకు చేరాలి : ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బులో కనీసం 80 శాతం ప్రజలకు చేరాలన్న లక్ష్యంతో సంస్కరణలు చేపట్టినట్లు కమిషనర్ ఇలంబర్తి చెబుతున్నారు. ఆయన ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు ఇప్పటికే తనిఖీలు చేపడుతున్నారు.
పరిశీలించాకే బిల్లుల ఆమోదం : పనులు మూడో ఏడాదికి కూడా పూర్తవ్వకపోతే ఆ తర్వాతి బిల్లులు జోనల్ స్థాయి కమిటీ పరిశీలించాకే ఆమోదం పొందుతాయి. దానికి ముందు కమిటీలోని అధికారులు చేసిన పనులను తనిఖీ చేస్తారు. కమిటీకి అఖిల భారత సర్వీసు స్థాయి అధికారి ఛైర్మన్‌గా, ముఖ్య ఇంజినీరు కన్వీనరుగా, జోనల్ కమిషనర్లు, వేర్వేరు స్థాయిల్లోని ఇంజినీర్లు, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు.
కమిటీలతో ప్రయోజనం ఇలా : జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రోడ్లు, వరద కాలువల నిర్మాణం, పూడిక తీత, పార్కుల నిర్వహణ పనుల్లో ఎక్కువ అవకతవకలు జరుగుతున్నాయి. 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాల్లో జరిగిన ఆయా నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పుడు ఆమోదానికి వచ్చాయి. ఆ బిల్లులు ఇప్పుడు రావడం ఏంటని కమిషనర్ ఇలంబర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దానిపై ప్రాథమిక విచారణ చేపట్టారు.
విజిలెన్స్ విచారణకు ఆదేశం : 90 బిల్లులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. 2020-21, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 538 బిల్లుల్లో సర్కిళ్ల వారీగా 10శాతాన్ని తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. పని మొదలు పెట్టిన రోజు నుంచి ఏయే అధికారి వద్ద బిల్లులు ఎన్ని రోజులపాటు నిలిచాయి, పూర్తి వివరాలు ఫైనాన్స్ విభాగం జారీ చేసే ఈఆర్‌పీలో కనిపించేట్టు సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేయించారు. తాజాగా మూడేళ్ల వరకు మొదలవని పనులను రద్దు చేయడం వంటి నిర్ణయాలతో కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు.
హైదరాబాద్‌లో వరద మాటే వినపడొద్దు! - ఏఐని రంగంలోకి దింపిన బల్దియా
జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.8,440 కోట్లు - చర్చ లేకుండానే కౌన్సిల్ ఆమోదం