Manchu Vishnu Spirit Movie : పాన్ఇండియా స్టార్ ప్రభాస్- సందీప్‌రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కనున్న మూవీ 'స్పిరిట్'. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కిస్తుండడం వల్ల ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు దాదాపు ముగింపు దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలోనే సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్న వాళ్లను ఎంపిక చేసుకుంటామని ఇటీవల ఓ ప్రకటన ఇచ్చారు. ఈ మేరకు 'క్యాస్టింగ్ కాల్' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు అప్లై చేసుకోవాలని తెలిపారు. ఆడిషన్స్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు.
అయితే ఈ ఆడిషన్స్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు అప్లై చేసుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. 'నేను అప్లై చేసుకున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం!' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విష్ణుకు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కుతుందో లేదో? అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Yo! I applied. Now let’s wait and see 💪🏽🥰 https://t.co/PXNOPrl5aS
— Vishnu Manchu (@iVishnuManchu) February 15, 2025
ఏంటీ క్యాస్టింగ్ కాల్?
సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావాహులను ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేసుకుంటామని మేకర్స్ ఇటీవల వెల్లడించారు. వయసుతో సంబంధం లేకుండా నటనపై ఆసక్తి గల నటీనటులందరూ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 2 ఫొటోలు, 2 నిమిషాల నిడివితో ఉన్న వీడియో రికార్డ్ చేసి సంబంధింత మెయిల్‌కు పంపాలని కోరారు.
కాగా, ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్ డోస్ హై రేంజ్లో ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అవుతుందని ముందుగా ప్రచారం సాగినా, ఇంకా పట్టాలెక్కలేదు. వేసవి తర్వాత చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సినీవర్గాల టాక్. 6 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద 'స్పిరిట్' ర్యాంపేజ్ ఉండడం పక్కాగా కనిపిస్తోంది.
ప్రభాస్ 'స్పిరిట్' అప్డేట్ - దూసుకెళ్లేందుకు సిద్ధంగా!
'స్పిరిట్' క్రేజీ అప్డేట్- ఒకటి కాదు మూడు లుక్స్‌లో కనిపించనున్న ప్రభాస్!