తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సమంత విలన్​గా నటించిన సినిమా తెలుసా? - ఫ్యామిలీమెన్ సిరీస్​ మాత్రం కాదు! - Happy Birthday Samantha - HAPPY BIRTHDAY SAMANTHA

Happy Birthday Samantha: జెస్సీగా వెండితెరకు పరిచయమై కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ సమంత ఆ తర్వాత ఈగ, రంగస్థలం, యూటర్న్‌, ఓ బేబీ, యశోద, శాకుంతలం వంటి విభిన్న చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కేవలం హీరోయిన్​గా మాత్రమే కాకుండా ప్రతి నాయకురాలిగా, వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా ప్రతిఒక్కరికీ మరింత చేరువైంది. అయితే చాలా మంది ఆమె ప్రతినాయకురాలిగా నటించి సినిమా ఏంటో తెలీదు. నేడు సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలతో పాటు ఆమె విలన్​గా నటించిన సినిమా ఏంటో తెలుసుకుందాం.

సమంత విలన్​గా నటించిన సినిమా తెలుసా? - ఫ్యామిలీమెన్ సిరీస్​ మాత్రం కాదు!
సమంత విలన్​గా నటించిన సినిమా తెలుసా? - ఫ్యామిలీమెన్ సిరీస్​ మాత్రం కాదు!

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 6:11 AM IST

Happy Birthday Samantha:సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్​గా రాణిస్తోంది. అయితే కొంత కాలం క్రితం మయోసైటిస్ బారిన పడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉంటూ అభిమానులకు చేరువలోనే ఉంది. ముఖ్యంగా హాట్ ఫొటోషూట్స్​ ద్వారా మరింత ఆకట్టుకుంటోంది. అదే సమయంలో పాడ్ కాస్త్​ను ప్రారంభించి తన అనుభవాలను, ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలను పంచుకుంటోంది. ఫిట్​నెస్​కు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

ఓవైపు హీరోయిన్​గా మరోవైపు విలన్​గా- సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇన్ని చేస్తున్నప్పటికీ సమంత ఇంతవరకు కొత్త సినిమాకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ త్వరలోనే వరుణ్ ధావన్​తో కలిసి తన పాత ప్రాజెక్ట్​ సిటాడెల్ వెబ్​సిరీస్​తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇందులో ఆమె యాక్షన్ సీక్వెన్స్​లను అదరగొట్టేసిందని ఇప్పటికే మూవీటీమ్ చెబుతోంది. అయితే సామ్​కు ఇలాంటి యాక్షన్ సీన్స్​ చేయడం కొత్తేదీ కాదు. గతంలోనూ యశోద చిత్రంలోనూ ఇలాంటి సాహసాలు చేసింది. అలానే ఫ్యామిలీ మెన్​ వెబ్​సిరీస్​లోనూ నెగటివ్​ పాత్రలో నటించి మెప్పించింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. బాలీవుడ్​లో ఈ సిరీస్​తో ఆమె మంచి క్రేజ్ దక్కించుకుంది. వీటన్నింటినీ కన్నా ముందు విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన 10లో ప్రతినాయకురాలిగా అదరగొట్టేసింది. ఇందులో ఆమె ఓవైపు కథానాయికగా, మరోవైపు ప్రతినాయకురాలిగా ద్విపాత్రాభినయంలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించింది. అయితే ఈ చిత్రంలో సామ్ నెగటివ్​ పాత్ర పోషించిందనే విషయం చాలా మందికి అంతగా తెలీదు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు.

ఆ సినిమాతో స్వయంగా డబ్బింగ్​- ఇకపోతే సమంత ప్రస్తుతం తన సినిమాల్లో తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ గతంలో ఆమెకు తన స్నేహితురాలు చిన్మయి డబ్బింగ్ చెప్పేది. అసలీ ఈ వాయిస్​ వల్లే సమంతకు బాగా క్రేజ్పెరిగింది. అలా ఓ దశలో బాగా క్రేజ్ పెరిగాక సామ్​ చిన్మయిని పక్కనపెట్టి స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టింది. యూటర్న్‌ సినిమాతో ఇలా చేయడం మొదలుపెట్టింది.

సమంత సైలెంట్ బ్లాస్ట్ - సోషల్ మీడియా షేక్​! - Samantha Upcoming Movies

రాహుల్ రవీంద్రన్​తో సమంత బీచ్ సాంగ్ - ఇప్పుడిదే ఫుల్ ట్రెండింగ్​!

ABOUT THE AUTHOR

...view details