Fahad fazil Aavesham Collections :పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. పుష్ప తర్వాత కూడా ఆయన ఎన్నో హిట్ చిత్రాలలో నటించారు. అలా తాజాగా మలయాళంలో మరో సూపర్ హిట్ అందుకున్నారాయన. అదే ఆవేశం.
ఈ మధ్య మాలీవుడ్ బాక్సాఫీస్ ముందు వరుసగా బ్లాక్ బస్టర్లు పడుతున్నాయి. మాములుగానే మలయాళ సినిమాల బడ్జెట్ తక్కువే ఉంటుంది. అయితే అందులో కథాబలం ఉన్న సినిమాలు పెట్టిన బడ్జెట్‌కు రెట్టింపు వసూళ్లను అందుకుంటూ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. రీసెంట్గా వచ్చిన మంజూమ్మల్ బాయ్స్, ప్రేమలు, భ్రమయుగం వంటి సినిమాలు ఈ కోవకే చెందినవి. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోవడానికి సిద్ధమైంది ఫహాద్ ఫాజిల్ ఆవేశం.
రిలీజైన తొలిరోజే ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రూ. 3.26 కోట్లు వసూళ్లు వచ్చాయట. గురువారం విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఉదయం 62.97 శాతం, మధ్యాహ్నం 73.67 శాతం, సాయంత్రం 78.85 శాతం, రాత్రి 78.78 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. హైదరాబాద్‌లోనూ ఈ సినిమాకు అత్యధికంగా 94 శాతం ఆక్యుపెన్సీ వచ్చిందని తెలసింది.