Miss India World Wide 2024 Title Dhruvi Patel : మిస్ ఇండియా వరల్డ్ వైడ్ - అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ పోటీల్లో పాల్గొనాలని, విజేతగా నిలవాలని చాలా మంది ప్రవాస భారతీయులైన అమ్మాయిలు, మహిళలు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే అందాల కిరీటాన్ని అందుకోవాలంటే వారికి అందం మాత్రమే కాదు అపార ప్రతిభ, ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి.
అయితే తాజాగా న్యూ జెర్సీలో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు జరిగాయి. ఇందులో ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటాన్ని ధ్రువీ పటేల్ దక్కించుకుంది. ఈమె అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి. "మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్‌ను అందుకోవడాన్ని అపురూప గౌరవంగా భావిస్తున్నాను. కిరీటం కన్నా ఇది ఎక్కువ. ఇది కేవలం కిరీటమే కాదు నా సంస్కృతి, సంప్రదాయలు, విలువలకు ప్రతీక. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే అవకాశాన్ని అందించింది." అని కిరీటం అందుకున్న తర్వాత ధ్రువీ పేర్కొంది. అలాగే తాను బాలీవుడ్ నటి అవ్వాలని, ఇంకా యూనిసెఫ్ అంబాసిడర్‌గా రాణించడం తన కోరిక అని చెప్పింది.
ఇక ఇదే పోటీల్లో సురినామ్‌కు చెందిన లిసా(Lisa Abdoelhak) ఫస్ట్ రన్నరప్‌గా, నెదర్లాండ్స్‌కు చెందిన మాల్వికా శర్మ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.
మిసెస్ కెటగిరీలో ట్రినిడాడ్‌కు చెందిన , సుఅన్ మౌటెట్, టొబాగో విజేతలుగా నిలిచారు. యూకే నుంచి స్నేహా నంబియార్, పవన్డిప్ ఫస్ట్, సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.