Dhanya Balakrishna Sharma and Ambani OTT : ఓటీటీలలో హారర్, సస్పెన్స్, క్రైమ్ జోనర్‌కు చెందిన సినిమాలు లేదా సిరీస్‌లు ఎక్కువగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. అలా తాజాగా మరో క్రైమ్ కామెండీ థ్రిల్లర్ శర్మ అండ్ అంబానీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. దీంతో మూవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
ట్విస్ట్‌లతో సాగుతూ - సినిమాలో వజ్రాలను ఎలా అయినా దక్కించుకోవాలనే ఒక ముఠా వల్ల శర్మ, అంబానీల జీవితం రకరకాల మలుపులు తిరుగుతూ ఉంటుంది. చివరకు ఆ ముఠాకు ఆ వజ్రాలు దొరికాయా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ లైన్. శర్మ, అంబానీ వాళ్ళకు ఎదురైన ప్రతి సవాల్‌ను ఎదుర్కొనే తీరు, సమస్య పరిష్కారాన్ని ఆలోచించే తీరుతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. అలా ఈ మూవీ చివర వరకు ఎన్నో ట్విస్ట్‌లతో థ్రిల్లర్ సాగుతూ ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కేశవ్ కర్రీ నటించారు. ఆయుర్వేద మందులను అమ్మే శర్మ పాత్రలో భరత్, అతని గర్ల్ ఫ్రెండ్ సితార పాత్రలో ధన్య, షూ పాలిష్ చేసుకునే అంబానీ పాత్రలో కేశవ్ బాగా మెప్పించారు. ఇంకా వీరితో పాటు మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మండలిక, యష్, రూపక్ మిగిలిన పాత్రల్లో నటించారు. ఈటీవీ విన్లో ఈ చిత్రం ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.