Raviteja RT75 Title Release Date Poster Released : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన 75వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌తోనే బిజీగా ఉంటున్నారు. డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోన్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నరు.
#RT75 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ అదిరిపోయే దీపావళి అప్డేట్ ఇచ్చారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
'RT75' చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మనదే ఇదంతా క్యాప్షన్ జోడించారు. సినిమాను వచ్చే ఏడాది 2025 మే 9న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని టైటిల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీపావళికి మోత మోగిపోద్ది, మనదే ఇదంతా అంటూ రాసుకొచ్చారు. పోస్టర్లో రవితేజ చేతిలో గంట పట్టుకుని రివాల్వర్ ప్యాంటులో పెట్టుకుని స్మైలింగ్ లుక్‌లో మాస్ నడుస్తూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా యాక్షన్ మోడ్ కనిపిస్తోంది. దీంతో ఈ స్టిల్ యాక్షన్ సీక్వెల్ చిత్రీకరణలోనిది అని అర్థమవుతోంది. ఈ తాజా టైటిల్, రిలీజ్ డేట్ పోస్టర్ అప్డేట్తో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.