Daaku Maharaaj Press Meet :నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో 'డాకు మహారాజ్'గా అభిమానుల ముందుకు రానున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ విశేషాలు మీ కోసం.
బాలకృష్ణతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తోంది?
నాగవంశీ: ఆయనతో వర్క్ చేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అయితే ఈ సినిమాలో మీరు ఆయన్ను సరికొత్తగా చూస్తారు. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ ఆయన ఇలాంటి లుక్‌లో కనిపించలేదు. 'అఖండ', 'లెజెండ్' గురించి ఎలా అయితే అభిమానులు చెప్పుకుంటున్నారో ఈ సినిమా గురించి కూడా అలానే మాట్లాడుకుంటారు. ఇక సినిమా ఇంటర్వెల్‌లోనే నాకు ఫోన్ చేసి ఈ మాట చెబుతారు.
ఈ సినిమాలో బాలయ్య రోల్ ఎలా ఉండనుంది ?
బాబీ : ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఎలా ఉంటున్నారో ఇందులోనూ అలానే ఉంటారు. ఈ కథకు బాబీ దేవోల్ విలన్‌గా సరిపోతారని అనిపించింది. 'యానిమల్' కంటే ముందే మేము ఈ కథను ఆయనకు చెప్పాం.
'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఎక్కడ ఉంటుంది?
నాగవంశీ: ఆంధ్రాలో ఉంటుంది. దీని కోసం మేము మూడు గ్రాండ్ ఈవెంట్‌లు ప్లాన్ చేశాం. జనవరి 2న హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత రెండు రోజులకు అమెరికాలో ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ సినిమాకు సంబంధించిన ఓ పాటను రిలీజ్ చేయనున్నాం. జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. విజయవాడ, మంగళగిరిలో ఉండొచ్చు.
చిరంజీవి, బాలకృష్ణలతో వర్క్ చేయడం ఎలా ఉంది?
బాబీ :వాళ్లిద్దరూ చాలా గ్రేట్ యాక్టర్స్. నాకు ఎంతో ఆనందంగా ఉంది.
నాగవంశీ :చిరంజీవి గారి అభిమానులు నన్ను తిట్టుకున్నా ఫర్వాలేదు. వాల్తేరు వీరయ్య కంటే 'డాకు మహారాజ్'ను బాబి బాగా తీశాడు (నవ్వుతూ).