Colour Photo Director Sandeep Raj Marriage : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతోంది. కలర్ ఫొటో ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ త్వరలోనే వివాహ బంధంలో అడుగు పెట్టనున్నారు. ఇంతకీ, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే?
ఆ నటితో పెళ్లి(Sandeep Raj and Chandini Rao) - సందీప్ రాజ్ చేసుకోబోయేది నటి చాందిని రావుని. ఆమె కొంత మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. 'కలర్ ఫొటో' చిత్రంలోనే ఓ కీలక పాత్రలో కనిపించింది. అప్పుడే వీరి పరిచయం మొదలైంది. ఆ తర్వాత సందీప్ రాజ్ కథ అందించిన 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో ఓ పాత్ర పోషించింది చాందిని రావు. ఇంకా 'రణస్థలి' సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ మెరిసింది.
Sandeep Raj Wedding Date : సందీప్ రాజ్, చాందిని రావు నిశ్చితార్థం నవంబర్ 11న విశాఖ పట్టణంలో జరుగుతుందని సమాచారం అందుతోంది. ఆ తర్వాత నెలలోపే ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెడతారట. డిసెంబర్ 7న ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం అందుతోంది.