తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ట్రెండింగ్​లో సమంత 'సిటాడెల్'​ - ఈ సిరీస్​ కోసం ఆమె ఎన్ని కోట్లు తీసుకుందంటే? - CITADEL SAMANTHA REMUNERATION

సిటాడెల్​ సిరీస్​ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ సమంత!

Citadel Series Samantha Remuneration
Citadel Series Samantha Remuneration (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 10:07 AM IST

Citadel Series Samantha Remuneration : సమంత రూత్ ప్రభు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌లో ఏదో ఒక టాపిక్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. కెరీర్ పరంగా ఎప్పుడూ టాప్ గేర్​లోనే ఉండే ఈ అమ్మడు సినిమాలు, వెబ్ సిరీస్, టెలివిజన్ షోలు ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది.

2021లో ఆమె నటించిన 'ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2'(దర్శకులు రాజ్ అండ్ డీకే) సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే దర్శకులతో మరో సిరీస్‌తో రాబోతున్నారామె. 'సిటాడెల్: హనీ బన్నీ' అనే థ్రిల్లింగ్ డ్రామాతో 2024 నవంబర్ 7న మన ముందుకు రానుంది. ఇప్పటికే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి ట్రైలర్ రిలీజై సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

అయితే ఈ సిరీస్‌లో నటించేందుకు సమంత రెమ్యునరేషన్ బానే తీసుకున్నారట. చివరిసారిగా 'ఖుషీ' సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన సమంత రూ.4.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ సిరీస్ కోసం పారితోషికం రెట్టింపు చేసి దాదాపు రూ.10 కోట్లు డిమాండ్ చేశారని పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.

'ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2'లో మంచి ప్రదర్శనతో సమంత మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు దానికి మించిన యాక్షన్ సన్నివేశాల్లో నటించానని చెప్పింది సమంత. "ద ఫ్యామిలీ మ్యాన్‌లో రాజీ క్యారెక్టర్‌తో పోల్చి చూస్తే ఇది చాలా డిఫరెంట్. సిటాడెల్‌లో నటించడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా. ఆ యాక్షన్ సన్నివేశాల్లో నటించి వాటిని స్క్రీన్‌పై చూసుకోవాలని ఎదురుచూస్తున్నా" అని ఆ మధ్య ఓ సారి ఇంటర్వ్యూలో చెప్పారు సామ్.

కాగా, అమెరికన్ సిరీస్ సిటాడెల్​కు రీమేక్​గా ఇండియన్ వెర్షన్​ సిటాడెల్ రాబోతుంది. ఈ సిరీస్​లో సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. వారితో పాటుగా కే కే మీనన్, సిమ్రాన్ బగ్గా, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, సాఖిబ్ సలీమ్ లు ఇతర పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సిటాడెల్: హనీ బన్నీ'కు రాజ్ & డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

ఒరిజినల్ అమెరికన్ సిరీస్​లో ఇందులో ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కలిసి నటించారు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా సెకండ్ సీజన్ కోసం కూడా షూటింగ్ మొదలుపెట్టేశారట. తొలి సీజన్ కోసం దదాపు 300 మిలియన్ డాలర్లు అంటే రూ.2వేల 500 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ సిరీస్ మేకర్స్ అక్కడితో ఆగలేదు. ఇటాలియన్ వెర్షన్ 'సిటాడెల్: డయానా' కోసం భారీ మొత్తంలో వెచ్చించి లండన్‌లో చిత్రీకరణ జరుపుతున్నారట.

చిత్ర పరిశ్రమలో అలా జరగాలని కోరుకుంటున్నా : సమంత

వరుణ్, సమంత - సింగిల్ షాట్​లో 11 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్​

ABOUT THE AUTHOR

...view details