Citadel Honey Bunny Records :స్టార్ హీరోయిన్ సమంత- బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ 'సిటడెల్: హనీ బన్నీ'. స్పై అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది. నవంబర్ 06 నుంచి ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రిలీజైన తొలి వారంలోనే ఈ సిరీస్ అద్భుతమైన ఘనత దక్కించుకుంది.
అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'సిటాడెల్ : హనీ బన్నీ'కి ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే వరల్డ్‌వైడ్‌గా అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా సిటాడెల్ హనీ బన్నీ అరుదైన రికార్డు కొట్టింది. ఆల్ఓవర్ వరల్డ్‌లో దాదాపు 200 దేశాల్లో ఈ సిరీస్ రిలీజైంది.
ఇక భారత్ సహా 30 దేశాల్లో అమెజాన్ చార్ట్స్‌లో నెం.1లో స్ట్రీమింగ్ అవుతోంది. 150 దేశాల్లో టాప్ 10లో స్ట్రీమింగ్ ఇది స్ట్రీమింగ్ అవుతోంది. అందులో అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, అస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, యూఏఈ వంటి దేశాలు ఉన్నాయి. అటు నాన్ ఇంగ్లీష్ వెర్షన్లో కూడా ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
కాగా, ఈ వెబ్‌సిరీస్ స్టార్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్'సిటడెల్'కు ఇది ఇండియన్ వెర్షన్. రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సమంతతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత నటనకుగాను ప్రశంసలు దక్కుతున్నాయి.