200 Horses Movie:బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'వెల్కమ్ టూ ద జంగిల్'. ఈ సినిమాను డైరెక్టర్ అహ్మద్ ఖాన్ భారీ తారాగణంతో తెరెక్కిస్తున్నారు. 'హీరో పంతి- 2', 'భాగీ- 2', 'భాగీ- 3' లాంటి యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన అహ్మద్ ఈ సినిమాలోనూ భారీగానే ప్లాన్ చేశారట.
ఇప్పటికే తొలి షెడ్యూల్‌లో 500 మంది డ్యాన్సర్లతో గ్రాండ్‌గా డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ చేశారట. కాగా, మరో షెడ్యూల్‌లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెల్ షూట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశానికి గుర్రాలను వాడనున్నారట. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 200 గుర్రాలను ఆ సీన్లో షూటింగ్‌కు ఉపయోగించనున్నట్లు బీ టౌన్ వర్గాలు తెలిపాయి. ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నాట్లు తెలుస్తోంది.
దీని కోసం ఇప్పటికే సినిమా యూనిట్ 200 గుర్రాలను అద్దెకు తీసుకుందట. ఇప్పటి వరకూ సినీ పరిశ్రమలో ఎన్నడూ చూడనంత యాక్షన్ సీక్వెన్స్‌ను చూస్తారని డైరెక్టర్ ఓ సందర్భంలో చెప్పారు. ఏడు రోజుల్లోగా గుర్రాలపై సన్నివేశాలను పూర్తి చేస్తారు. ఇప్పటికే వీటన్నింటినీ ముంబయి, మహాబళేశ్వర్, లోనావియా లాంటి ప్రధాన నగరాల నుంచి ముంబయి ఫిల్మ్ సిటీకి తెప్పించారు. వీటితో పాటు వాటి ట్రైనర్లను కూడా రప్పించారు.