Bobby Deol Career: సినీఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయమే. ఇప్పటికే అన్ని సినీ పరిశ్రమల్లో చాలా మంది స్టార్ల వారసులు ఎంట్రీ ఇచ్చారు. మరి కొంతమంది ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే అలా వచ్చిన అందరూ కెరీర్లో సక్సెస్ అవ్వలేరు. ఎంత సార్ట్ కిడ్స్ అయినా ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు వారిని అక్కున చేర్చుకుంటారు. లేదంటే కనుమరుగవ్వాల్సిందే. అలాంటిది బాబీ దేఓల్ ఒకప్పుడు తన కెరీర్లో 11 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఎదుర్కొన్నాడు. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా వెండితెరపైకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఫిదా చేశాడు.
బాలీవుడు మెగాస్టార్ ధర్మేంద్ర రెండు కుమారుడు బాబీ దేఓల్. అతడి అన్నయ్య కూడా సన్నీ దేఓల్ బాలీవుడ్లో ఓ స్టార్ హీరోనే. 1977లో 8ఏళ్ల వయస్సులో 'ధరమ్ వీర్' మూవీతో చైల్డ్ ఆర్టీస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బాబీ దేఓల్. తర్వాత 'బర్సాత్ 1995'లో ట్వింకిల్ ఖన్నాతో కలిసి బాలీవుడ్లో హీరోగా అడుగుపెట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకంది. ఈ సినిమాతో బాబీ దేఓల్ ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 'గుప్త ది హిడెట్ ట్రూత్' సినిమాలో యాక్ట్ చేశాడు. కెరీర్ మంచి స్పీడ్ మీదున్న సమయంలో ఐశ్వర్యరాయ్‌తో కలిసి నటించిన 'ఔర్ ప్యార్ హో గయా' బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేసినా ఏదీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అయితే వరుసగా 'చోర్ మచాయే షోర్', 'కిస్మత్', 'బర్దాష్త్', 'అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో', 'జుర్మ్', 'టాంగో చార్లీ', 'బర్సాత్', 'దోస్తీ-ఫ్రెండ్స్ ఫరెవర్', 'హమ్‌కో తుమ్సే ప్యార్ హై', 'షకలకా బూమ్' 11 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లుగా మిగిలాయి. 2012లో వచ్చిన 'హీస్ట్ ఫిల్మ్ ప్లేయర్స్'లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించాడు. కానీ ఆ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ మూవీ తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. 2017లో 'పోస్టర్ బాయ్స్'లో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.