Bigg Boss 8 Telugu Second Wild Card Contestant:బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్లో అడుగు పెడితే నలుగురు బయటకు వెళ్లిపోయారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌజ్లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీనికి తోడు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని.. హోస్ట్ నాగార్జున బాంబు పేల్చారు. ఇదిలా ఉంటే గత కొన్నిరోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు పార్టిసిపేట్ చేసిన మాజీ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా మళ్లీ బిగ్ బాస్ హౌజ్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఫొటో రిలీజ్ చేసిన బిగ్బాస్ నిర్వాహకులు.. తాజాగా రెండో కంటెస్టెంట్ ఫొటో రిలీజ్ చేసి గెస్ చేయమంటున్నారు. మరి.. ఆ వ్యక్తి ఎవరో మీరు గుర్తుపట్టగలరా?
బిగ్బాస్ నిర్వాహకులు రిలీజ్ చేసిన ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఫొటోను చూసిన నెటిజన్లు సీజన్ 7లో పార్టిసిపేట్ చేసిన టేస్టీ తేజనే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇప్పుడు రెండో వైల్డ్ కార్డ్ ఫొటోను చూసిన బిగ్ బాస్ అభిమానులు, నెటిజన్లూ తమకు తోచిన పేర్లు చెబుతున్నారు. ఈ ఫొటోను చూస్తుంటే బిగ్బాస్ సీజన్ 3లో సందడి చేసిన రోహిణి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్బాస్ 8: మిడ్ వీక్ షాకింగ్ ఎలిమినేషన్ - ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్! - కానీ!!