తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హైందవ' టీజర్ రిలీజ్- పవర్ఫుల్ కంటెంట్​తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా - HAINDAVA TEASER

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా టీజర్- విజువల్స్​తో వండర్స్​ క్రియేట్ చేశారుగా!

Haindava Teaser
Haindava Teaser (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2025, 7:14 PM IST

Updated : Jan 8, 2025, 7:19 PM IST

'హైందవ' టీజర్ రిలీజ్- పవర్ఫుల్ కంటెంట్​తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా

Haindava Teaser :హిందూ పురాణాల ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇటీవల కాలంలోనే 'కార్తికేయ-2', 'కల్కి 'అద్భుత విజయాలు అందుకున్నాయి. ఈ కోవలోనే శ్రీ మహా విష్ణువు దశావతారాలు కథాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'హైందవ' సినిమా రాబోతోంది. ఈ మూవీలో సంయుక్త కథానాయికగా నటిస్తోంది. లుధీర్ బైరెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ చందు నిర్మాత. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. మూవీ మేకర్స్ ఈరోజు మూవీ టీజర్‌ రిలీజ్​తో పాటు, టైటిల్‌ కూడా అనౌన్స్‌ చేశారు.

2.40 నిమిషాలు ఉన్న హైందవ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఓ అడవిలో దశావతారాలకు నెలవైన పురాతన ఆలయం ఉంటుంది. దశావతారాల్లో మత్య్స, కూర్మం, వరాహ, నరసింహ, వామన, పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, కల్కి అవతారాలు ఉంటాయి. ఈ ఆలయాన్ని కొందరు దుండగలు నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. వారిని అడ్డుకోవడానికి ఓ బైకులో హీరో సాయి శ్రీనివాస్‌ వస్తుంటాడు.

దుండగులు గుడికి నిప్పు పెట్టగానే చేపలు, వరాహం, సింహం, గద్ద వంటివి స్పందిస్తాయి. సింహం, వరాహం, గద్ద కూడా హీరో బైకు వెంట ప్రయాణిస్తున్న విజువల్‌ అద్భుతంగా ఉంటుంది. చివరికి హీరో దుండగులను అడ్డుకుని గుడిని రక్షిస్తాడు. మిస్టరీ, భారీ యాక్షన్‌ సీన్లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

టీజర్‌ పూర్తవగానే ఇంతకీ గుడిలో ఉండే మహిమలు ఏంటి? హీరోకి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఎవరు నాశనం చేయాలని చూస్తారు? వంటి ప్రశ్నలు తలెత్తుతాయి. వీటికి సమాధానం తెలియాలంటే సినిమా వరకు నిరీక్షించక తప్పదు. టీజర్‌లో విజువల్స్‌, గ్రాఫిక్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ అద్భుతంగా ఉన్నాయి. రాముడు, కృష్ణుని కీర్తనలను కలిగి ఉన్న లియోన్ జేమ్స్ మ్యూజిక్‌ సీన్స్‌ని చక్కగా ఎలివేట్ చేసింది. ఇప్పటికే సినిమా 30 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

పాన్- ఇండియా స్థాయిలో సినిమాని విడుదల చేయనున్నారు. టీజర్‌ చూసిన అభిమానులు సాయి శ్రీనివాస్‌ అకౌంట్‌లో మరో హిట్‌ పడుతుంని ధీమాగా ఉన్నారు. అన్ని భాషల్లో రిలీజ్‌ అవుతున్న సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

'ఎన్ని దెబ్బలు తగిలినా.. కష్టపడుతూనే ఉంటా!'.. 'ఛత్రపతి' రిజల్ట్​పై బెల్లంకొండ కామెంట్స్​

నిరాశపరిచిన హిందీ 'ఛత్రపతి'!.. తొలి రోజు కలెక్షన్స్​ ఎంతంటే?

Last Updated : Jan 8, 2025, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details