తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

50 ఏళ్ల కెరీర్‌లో బాలయ్య గెస్ట్ రోల్‌ చేసిన ఒకే ఒక సినిమా ఏంటో తెలుసా? - Balakrishna trimurtulu Guest Role

Balakrishna Guest Role Movie : నందమూరి నటసింహం బాలకృష్ణ తన 50ఏళ్ల సినీ కెరీర్​లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్​, బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. మరి ఆయన తన సుదీర్ఘ కెరీర్​లో గెస్ట్ రోల్​ చేసిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? దాని గురించే ఈ కథనం.

50 ఏళ్ల కెరీర్‌లో బాలయ్య గెస్ట్ రోల్‌ చేసిన ఒకే ఒక సినిమా ఏంటో తెలుసా?
50 ఏళ్ల కెరీర్‌లో బాలయ్య గెస్ట్ రోల్‌ చేసిన ఒకే ఒక సినిమా ఏంటో తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 11:01 AM IST

Updated : Feb 26, 2024, 11:45 AM IST

Balakrishna Guest Role Movie : ఓ స్టార్ హీరో సినిమాలో మ‌రో స్టార్ హీరో గెస్ట్‌గా కనిపిస్తే ఆ కిక్కే వేరబ్బా. అదే ఓ చిన్న చిత్రంలో కనిపిస్తే ఆ సినిమాకు అదే పెద్ద ప్రమోషన్. ఎప్పుడు నుంచో ఈ స్టార్ హీరోల గెస్ట్ రోల్ ట్రెండ్ నడుస్తోంది. అమితాబ్​ చిరంజీవి, ర‌జ‌నీకాంత్‌ మొదలుకొని ఇప్పుటి ఎన్టీఆర్, అల్లు అర్జున్​ వరకు అడ‌పాద‌డ‌పా ఇత‌ర హీరోల చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసినవారే.

టాలీవుడ్ విషయానికొస్తే చిరంజీవి త‌న కెరీర్‌లో ప‌దిహేనుకుపైగా చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశారట. నాగార్జున అయితే 20కుపైగా సినిమాల్లో చేయగా వెంకటేశ్​ కూడా పలు తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో మెరిశారు. కానీ బాలయ్య మాత్రం అలా కాదు. వికిపీడియా ప్రకారం ఇప్ప‌టివ‌ర‌కు తన కెరీర్​లో కేవ‌లం ఒకే ఒక్క సినిమాలో మాత్ర‌మే అతిథి పాత్రలో కనిపించారట. ఆ సినిమా పేరు త్రిమూర్తులు.

విక్టరీ వెంక‌టేశ్​, అర్జున్‌, రాజేంద్ర‌ ప్ర‌సాద్ హీరోలుగా న‌టించిన ఈ తెలుగు చిత్రం 1987లో విడుదలైంది. హిందీలో భారీ సక్సెస్​ అందుకున్న న‌సీబ్‌ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కే ముర‌ళీమోహ‌న్‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌హేశ్వ‌రి ప‌ర‌మేశ్వ‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్​పై టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఈ చిత్రంలోని ఓ పాట‌లోనే టాలీవుడ్ అగ్ర హీరోలు కృష్ణ‌, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, బాల‌కృష్ణ గెస్ట్‌లుగా కనిపించి ఆకట్టుకున్నారు. వీరితో పాటు రాధ‌, విజ‌య‌శాంతి, రాధిక‌, భానుప్రియ‌ సహా మరి కొంతమంది హీరోలు, హీరోయిన్లు క‌నిపించారు. అయితే ఇందులో ఎన్టీఆర్​, అక్కినేని నాగేశ్వరరావు కూడా కనపడాల్సింది. వారికి కుదరకే బాలయ్య, నాగార్జున కనిపించారు. అలా బాలయ్య తన కెరీర్ మొత్తంలో గెస్ట్ రోల్ చేసిన చిత్రం త్రిమూర్తులు మాత్ర‌మే అని తెలిసింది. అంతే కాకుండా చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్, నాగార్జున క‌లిసి క‌నిపించిన చిత్రం కూడా ఇదే.

ఇక త్రిమూర్తులు సినిమా తర్వాత అతిథి పాత్రల్లో మెరిసే అవకాశం బాలయ్యకు పలు సార్లు వచ్చిందట. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. రీసెంట్​గా కూడా రజనీకాంత్ జైలర్​లోనూ ఆయన కనపడాల్సింది. కానీ అది కుదరలేదు. ప్రస్తుతం బాలయ్య ద‌ర్శ‌కుడు బాబీతో ఎన్​బీకే 109 చేస్తున్నారు. షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా సాగుతోంది.

లావణ్య త్రిపాఠితో లవ్​ - వరుణ్ తేజ్​పై కోపం పెంచుకున్న చిరు!

ఓటీటీలో హార్ట్ బీట్ పెంచే హారర్ మూవీస్​ - అక్కడ ఫ్రీగా చూడొచ్చు!

Last Updated : Feb 26, 2024, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details