తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

4 ఆటలతో 100 డేస్ - షిఫ్ట్​ కాకుండా 400 డేస్​ - ఆ ఊరిలో బాలయ్య క్రేజ్ అట్లుంటది మరి - Balakrishna 400 Days Movie

Balakrishna 400 Days Movie : ఆయన సినిమాలు థియేటర్​లో రిలీజవుతున్నాయంటే ఇక అభిమానుల్లో ఎక్కడ లేని ఆనందం. ఆ మూవీ థియేటర్​లో ఉన్నని రోజులు వారికి ఇక పండగే. ఇప్పటి వరకూ ఆయనవి ఎన్నో సినిమాలు థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడినవి ఉన్నాయి. అయితే ఒక్క ఊర్లో మాత్రం బాలయ్య బ్లాక్​బస్టర్ మూవీ ఏకంగా 400 రోజులకు పైగా ఆడిన రికార్డుకెక్కింది. ఇంతకీ అది ఏ సినిమా, ఆ ఊరు పేరు ఏంటో తెలుసుకుందామా?

Balakrishna 400 Days Movie
Balakrishna 400 Days Movie (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 4:21 PM IST

Balakrishna 400 Days Movie : బాలయ్య సినిమాలు థియేటర్​లో రిలీజవుతున్నాయంటే ఇక అభిమానుల్లో ఎక్కడ లేని ఆనందం. ఆ మూవీ థియేటర్​లో ఉన్నని రోజులు ఇక పండగే. ఇప్పటి వరకూ ఆయనవి ఎన్నో సినిమాలు థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడినవి ఉన్నాయి. అయితే ఒక్క ఊర్లో మాత్రం ఆయన మూవీస్ ఏకంగా 400 రోజులకు పైగా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అది ఏ ఊరో తెలుసుకుందామా?

రాయలసీమలో బాలయ్య క్రేజ్
ఆంధ్రప్రదేశ్​లోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బాలయ్యకు తిరుగులేని ఫ్యాన్​ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన బ్లాక్​బస్టర్ మూవీ 'లెజెండ్' అయితే ఏకంగా కడప, కర్నూల్ జిల్లాల్లో రెండు సెంటర్లలో 400 రోజుల పాటు ఆడింది. కడపలోని ఒక సెంటర్​లో అయితే ఏకంగా 1100 రోజుల పాటు ఆడింది.

కర్నూల్ జిల్లాలోని ఎమ్మిగనూరులో బాలయ్య సినిమాలు ఓ రేంజ్​లో రన్ అవుతాయి. ఎలాగంటే బాలయ్య మూవీ హిట్ అయితే అక్కడ కచ్చితంగా 100 రోజులు ఆడాల్సిందే. ఇక్కడ సుమారు 11 బాలయ్య సినిమాలు 4 ఆటలు, షిఫ్టింగ్ లేకుండానే 100 రోజులకు పైగా ఆడాయి.

ఎమ్మిగనూరులో బాలయ్య 100 రోజుల సినిమా లిస్ట్ చూస్తే 'పెద్దన్నయ్య', 'సమర సింహారెడ్డి', 'నరసింహనాయుడు' 'చెన్నకేశవరెడ్డి', 'లక్ష్మీ నరసింహ', 'సింహా', 'లెజెండ్', 'డిక్టేటర్'​,'గౌతమి పుత్ర శాతకర్ణి', 'జై సింహా' ఈ సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. 'లెజెండ్' అయితే ఏకంగా 421 రోజులు ఆడి రికార్డుకెక్కింది. ఇక 'సమరసింహా రెడ్డి' 177 రోజులు, 'నరసింహా నాయుడు' 176 రోజులు ఆడాయి.

Balakrishna Hit Movies List :బాలయ్య సినిమాలకు ఇప్పట్లోనే కాదు అప్పట్లోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని ఏడాది ఒకటి ఉంది. అదే 1986. ఇంతకీ ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి అని అంటారా? ఎప్పటిలాగే సెన్సేషన్ సృష్టించే బాలయ్య ఆ ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బ్లాక్​బ్లస్టర్​ మూవీస్​ను (ముద్దుల క్రిష్ణయ్య, సీతారామ కల్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు,దేశోద్ధారకుడు,కలియుగ కృష్ణుడు,అపూర్వ సహోదరులు) అభిమానులకు అందించి బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించారు.

చిరు సినిమాల్లో బాలయ్య ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా? - Balakrishna Favourite Movie

ఫ్యాన్​ కోరిక తీర్చిన బాలయ్య - అభిమానులంటే ఆయనకు అంత ప్రేమ! - Balakrishna Fulfills Fans Dream

ABOUT THE AUTHOR

...view details