ETV Bharat / entertainment

108లో 22 సినిమాలు 'సంక్రాంతి'కే- ఈసారి 'డాకు'తో గురి- బాలయ్య జోరు అలా ఉంటది మరి! - BALAKRISHNA SANKRANTI MOVIES

సంక్రాంతి అంటే రైతుల పండుగే కాదు, బాలకృష్ణ అభిమానుల వేడుక కూడా. సంక్రాంతికి తెరపై బాలయ్య బొమ్మ పడాల్సిందే, 'జై బాలయ్య' నినాదాలతో థియేటర్లు మార్మోగాల్సిందే. ఇక ఈసారి సంక్రాంతికి 'డాకు మహారాజ్​'తో రానున్నారు.

Daku Maharaj Balakrishna
Daku Maharaj Balakrishna (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2025, 6:30 PM IST

Balakrishna Sankranti Movies : తెలుగు తెరపై సంక్రాంతి హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఏడాది తిరిగే సరికి పండుగ బరిలో సినిమాను దించేవారు బుర్రిపాలెం బుల్లోడు. ఆ తర్వాత ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ సంక్రాంతి సందడంతా తనదే అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటి వరకు బాలయ్య నటించిన 108 చిత్రాల్లో దాదాపు 22 చిత్రాలు సంక్రాంతి పండుగకు విడుదలై సందడి చేశాయి. అందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్​ను మోత మోగిస్తూ, సంక్రాంతి పండుగంటే రైతులదే కాదు, నందమూరి బాలయ్య అభిమానులదే అనేంతగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనేలా చేశారు.

2023లో 'వీరసింహారెడ్డి'తో 'మైలురాయికి మీసం మెలిపించిన బాలయ్య' తన DNAలో ఉన్న పొగరేంటో చూపించారు. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్ దగ్గరే కాదు, పసిపిల్లల దగ్గరి నుంచి పండు ముసలివాళ్లు సైతం 'జై బాలయ్య' అని ముద్దుగా పిలుచుకునేలా చేశారు. 2023 సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగంవత్ కేసరి' హ్యాట్రిక్ విజయాలతో ఉన్న బాలయ్య అదే జోరును 2025లో తెరపై చూపించకుండా ఉంటారా? తనకు అచొచ్చిన సంక్రాంతికి సందడి చేసేందుకు యంగ్ డైరెక్టర్​ బాబీ దర్శకత్వంలో 'డాకు మహారాజ్' ను ఎంచుకున్నారు. అప్పుడెప్పుడో 'ఆదిత్య 369'లో ముసుగు దొంగలా వచ్చి కృష్ణకుమార్​ను కాపాడిన కృష్ణదేవరాయులును గుర్తు చేస్తూ, 'చెడ్డవాళ్లకు డాకు, మంచివాళ్లకు మహారాజ్' అనిపించుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో రాయలసీమ తన అడ్డగా పవర్ పుల్ పాత్రలో ప్రత్యక్షమై థియేటర్లో పూనకాలు తెప్పించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.

సంక్రాంతి హీరో
బాలకృష్ణ ఇప్పటి వరకు చేసిన 108 సినిమాల్లో దాదాపు 22 చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. అందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్​ వద్ద ఘన విజయాలు అందుకున్నాయి. అందుకే బాలయ్యను తమ అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు సైతం 'సంక్రాంతి హీరో' అంటుంటారు. ఇప్పుడు 109వ చిత్రంగా 'డాకు మహారాజ్'తో సంక్రాంతి బరిలో దిగిన బాలయ్య, తన చరిత్రను తానే తిరగరాస్తానని చెబుతున్నారు.

బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో నటించిన 'వేములవాడ భీమకవి' చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఆ తర్వాత 'దాన వీర శూర కర్ణ', 'అనురాగ దేవత' చిత్రాలు సంక్రాంతికే వచ్చాయి. కాకపోతే ఆ చిత్రాల్లో ఎన్టీఆర్ హీరో కావడం వల్ల అవి బాలకృష్ణ ఖాతాలో పడలేదు. కానీ 1985లో 'ఆత్మబలం' చిత్రంతో తొలిసారి సంక్రాంతికి సోలో హీరోగా వచ్చారు. కానీ, ఈ సినిమా అనుకున్న ఫలితం ఇవ్వలేదు.

మళ్లీ 1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 'భార్గవ రాముడి'తో పండక్కి వచ్చారు. ఈ చిత్రం బాలయ్యకు మంచి పేరు తీసుకొచ్చింది. 1988 సంక్రాంతికి 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్' గా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 1989లో 'భలే దొంగ' కూడా సంక్రాంతికి బాలయ్యకు విజయాన్ని ఇచ్చింది. 1997లో 'పెద్దన్నయ్య' కూడా విజయం సాధించింది.

ఇండస్ట్రీ హిట్
1999లో విడుదలైన 'సమరసింహారెడ్డి' సినిమాతో సంక్రాంతి సినిమాల హిస్టరినే మార్చేశారు బాలకృష్ణ. బి.గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న కలెక్షన్ల రికార్డులు తిరగరాసి కనివినీ ఎరుగని స్థాయిలో విజయాన్ని అందుకున్నారు బాలకృష్ణ. తెలుగులో ఫ్యాక్షన్ చిత్రాలకు ట్రెండ్‌ సెట్టర్​గా నిలిచింది. ఇక 2001లో సంక్రాంతికి విడుదలైన 'నరసింహానాయడు' సినిమాతో మరోసారి రికార్డులతో బాలయ్య చెడుగుడు ఆడుకున్నారు. 2004లో ఓ వైపు ప్రభాస్ 'వర్షం', చిరంజీవి 'అంజి' చిత్రాలతో పోటీపడుతూ 'లక్ష్మీ నరసింహా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఖాకీ డ్రెస్ లో కన్నెర్ర జేస్తే బాక్సాఫీస్​ షేక్ అయ్యింది.

రెండేళ్ల తర్వాత
ఇక 2017లో క్రిష్ దర్శకత్వంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో మరోసారి సంక్రాంతి బరిలో దిగి సూపర్ హిట్ అందుకున్నారు. ఇది బాలయ్యకు 100వ చిత్రం కావడం విశేషం. ఆ తర్వాత 2018, 2019లో వచ్చిన చిత్రాలు ప్రతికూల ఫలితాలు ఇచ్చినా ఏ మాత్రం తన అభిమానులను నిరాశపర్చని బాలయ్య, 2023లో 'వీరసింహారెడ్డి'తో ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఇక రెండేళ్ల తర్వాత మళ్లీ సంక్రాంతికి బాలయ్య 'డాకు మహారాజ్'తో బాక్సాఫీస్​కు గురిపెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.