Alluarjun Trivikram Movie Budget : జులాయి, అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ - బన్నీ కలిసి ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప రెండు భాగాలుగా రావడం వల్ల ఇది ఆలస్యమైంది. పైగా మధ్యలో అట్లీ సహా ఇతర దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.
అయితే ఇప్పుడు పుష్ప 2 దాదాపుగా చివరి దశకు చేరుకోవడంతో నెక్స్ట్ బన్నీ ఎవరితో సినిమా చేస్తారా అన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు నిర్మాత బన్నీ వాసు. అయితే ఈ సినిమా బడ్జెట్ కోసం అల్లు అరవింద్ డబ్బులు చూసుకోవాలని అన్నారు.
"అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లైన్ ఫిక్స్ అయిపోయింది. కానీ అది భారీ బడ్జెట్ మూవీ. ఆ మూవీ చేయడానికి అల్లు అరవింద్, చినబాబు ఫైనాన్షియర్లను, కార్పొరేటర్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. అంత భారీ బడ్జెట్‌తో రానున్న చిత్రమిది. త్రివిక్రమ్‌కు పాన్ ఇండియా మూవీ చేయగల సామర్థ్యం ఉందని బన్నీకి బాగా నమ్మకం ఉంది. వీరిద్దరూ ఎప్పుడో రెండేళ్ల క్రితమే మాట్లాడుకొని ఒక కాన్సెప్ట్‌ను ఫిక్స్ చేసుకున్నారు. అయితే దీని బడ్జెట్‌కు, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు ఏడాది లేదా ఏడాదిన్నార సమయం పడుతుంది. దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికే అంత సమయం పడుతుంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్." అంటూ బన్నీ వాసు చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.