Pushpa 2 The Rule 1500 Crore Collections : ఇండియన్ సినిమా హిస్టరీలో కమర్షియల్ సినిమాకు సరికొత్త నిర్వచనాన్ని చెబుతోంది పుష్ప 2 : ది రూల్. బాక్సాఫీస్ భారీ వసూళ్లను అందుకునే విషయంలో పుష్ప రాజ్ వాయువేగంతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1,508 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన ఈ మూవీ
కేజీయఫ్ 2 (రూ.1250 కోట్లు), RRR (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్ రికార్డ్ కలెక్షన్లు అధిగమించిన పుష్ప 2, బాహుబలి 2 (రూ.1810 కోట్లు) వసూళ్లను అధిగమించే దిశగా దూసుకెళ్తోంది. కాగా, ఇప్పటికే అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల జాబాతాలో ఆమిర్‌ఖాన్ దంగల్ (రూ.2,024 కోట్లు) అగ్రస్థానంలో ఉంది.