PUSHPA 2 OTT RELEASE : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 : ది రూల్ ప్రస్తుతం బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారతీయ సినీ హిస్టరీలో ఏ కమర్షియల్ చిత్రం సాధించనన్ని వసూళ్లను అందుకుంటోంది. అయితే ఈ క్రమంలో ‘పుష్ప 2 ఓటీటీపై వార్తలు వచ్చాయి. జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కానుందంటూ పోస్టులు కనిపించాయి.
అయితే దీనిపై తాజాగా చిత్రబృందం స్పందించింది. 56 రోజుల (థియేటర్లలో విడుదలైన నాటి నుంచి) కన్నా ముందు ఏ ఓటీటీలోనూ ఈ సినిమా విడుదల కాదని క్లారిటీ ఇచ్చింది. సిల్వర్స్క్రీన్పైనే పుష్ప 2ను చూసి హాలీడే సీజన్‌ను ఎంజాయ్ చేయమని పేర్కొంది.