Maharashtra Train Accident : మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల మీదుగా రైలు దూసుకెళ్లిన ఘటనలో 12 మంది మృతి చెందగా, 40 గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పర్ధాడే రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
VIDEO | At least six persons were killed after they stepped down from their train on the tracks and were run over by another train coming from the opposite direction in North Maharashtra's Jalgaon district on Wednesday evening.
— Press Trust of India (@PTI_News) January 22, 2025
Visuals from the spot near Pachora station, where… pic.twitter.com/Ug7Z5gAKoz
సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం-- లఖ్‌నవూ నుంచి ముంబయి వస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయన్న వదంతులు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగి, కిందకు దిగారు. కొందరు పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో బెంగళూరు నుంచి దిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఒక్కసారిగా వారిని ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు పంపామని, ఘటనా స్థలికి విపత్తు సహాయక రైలు వెళ్లిందని సెంట్రల్ రైల్వే ప్రతినిధి స్వప్నిల్ నిలా తెలిపారు.
VIDEO | Here's what Central Railway CPRO Swapnil Nila said on Pushpak Express train mishap.
— Press Trust of India (@PTI_News) January 22, 2025
" a chain pulling incident occurred on the lucknow-chhatrapati shivaji maharaj terminus pushpak express between maheji and pardhade stations. the train had stopped, after which some… pic.twitter.com/ocWfemHn2d
అయితే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక కోచ్‌లో హాట్ యాక్సిల్ లేదా బ్రేక్ బైండింగ్ కారణంగా నిప్పురవ్వలు చెలరేగాయని అధికారి ఒకరు తెలిపారు. అందుకే ప్రయాణికులు చైన్ లాగి ఉంటారని చెప్పారు.
సీఎం విచారం
ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'మంత్రి గిరీశ్ మహాజన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం రైల్వే అధికారులతో సమన్వయం చేస్తూ పనిచేస్తోంది. క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది అంబులెన్సులను అధికారులు పంపారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు జనరల్ ఆస్పత్రులతో పాటు సమీపంలోని ఇతర ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధంగా ఉంచారు. గ్లాస్ కట్టర్లు, ఫ్లడ్ లైట్లు వంటి అత్యవసర పరికరాలను సైతం సిద్ధం చేశారు. మేమంతా అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. అవసరమైన సహాయాన్ని తక్షణమే అందిస్తున్నాం' అని సీఎం పేర్కొన్నారు.
Maharashtra CM Devendra Fadnavis tweets, " the unfortunate incident near pachora in jalgaon district in which some people lost their lives is very painful. i pay my heartfelt tributes to them. my colleague minister girish mahajan and the superintendent of police have reached the… pic.twitter.com/K76ma1Pa55
— ANI (@ANI) January 22, 2025
మరోవైపు, ఇదే ఘటనపై మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్ స్పందించారు. సీనియర్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొంటున్నారని చెప్పారు.