Alka Yagnik Net Worth :సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సింగర్స్ తమ ట్యాలెంట్‌తో పలు హిట్ సాంగ్స్ అందించారు. అందులో బాలీవుడ్ మెలోడీ క్వీన్ అల్కా యాగ్నిక్ కూడా ఒకరు. ఇప్పటి వాళ్లకు ఈమె సుపరిచితురాలు కానప్పటికీ, 90స్ ప్రేక్షకులకు ఈమె బాగా తెలుసు. కిషోర్ కుమార్, కుమార్ సానూ, సోనూ నిగమ్, ఆషా భోస్లే లాంటి దిగ్గజాలతో కలిసి వర్క్ చేశారు. ఐదు పదుల వయసులోనూ చక్కటి గాత్రంతో ఇప్పటి యూత్‌ను ఉర్రూతలూగించే పాటలు పాడుతున్నారు. 1980లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఇప్పటి వరకు దాదాపు 8,000 పాటలను రికార్డ్ చేసి అత్యుత్తమ సింగర్లలో ఒకరిగా రాణిస్తున్నారు.
తన ముప్పై ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు అల్కా ఉత్తమ నేపథ్య గాయనిగా ఏడుసార్లు ఫిల్మఫేర్ అవార్డును అందుకున్నారు. అంతే రెండు నేషనల్ అవార్డులు, పలు నేషనల్, ఇంటర్నేషన్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 2013లో ప్రతిష్టాత్మక లతా మంగేష్కర్ అవార్డు కూడా అందుకున్నారు.
హిందీలోనే కాకుండా గుజరాతీ, మరాఠీ, భోజ్ పురి, బెంగాలీ, తెలుగు, నేపాలీ, ఒరియా, పంచాబీ, అస్సామీ లాంటి విభిన్న భాషల్నింటిలోనూ దాదాపు ఆమె పాటలు పాడారు. తన లిస్ట్‌లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నప్పటికీ, 'ఏక్ దో తీన్', 'చోలీ కే పీచే', 'మేరీ మెహబూబా', 'తాల్ సే తాల్', 'దిల్ నే యే కహా హై దిల్ సే', 'ఓ రే చోరీ', 'హమ్ తుమ్', 'గూంగట్ కి ఆద్ సే', 'కుచ్ కుచ్ హోతా హై', 'కహో నా ప్యార్ హై', 'సన్ సనా', 'కబీ అల్విదా నా కెహనా', 'అగర్ తుమ్ సాత్ హో' లాంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ ఫేవరట్ పాటలుగా ఉన్నాయి.