తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పారిస్‌ ఫ్యాషన్​ వీక్​లో అలియా​, ఐశ్వర్య రాయ్ ర్యాంప్ వాక్​​ - అందం అదరహో - ALIABHATT AISHWARYA RAI

పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో బాలీవుడ్ అందాల తారలు ఐశ్వర్యా రాయ్​, అలియా భట్​ ర్యాంప్ వాక్ చేశారు. అదిరిపోయే డ్రెస్​లో కనువిందు చేసి ఫ్యాన్స్​ను మరోసారి ఫిదా చేశారు.

source Getty Images
AliaBhatt Aishwarya Rai Paris Fashion Week (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 11:01 AM IST

Updated : Sep 24, 2024, 11:08 AM IST

Alia Bhatt Paris Fashion Week : బాలీవుడ్‌ హీరోయిన్​ అలియా భట్‌ పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో మొదటి సారి హొయలొలికించింది. ఈ ఈవెంట్‌లో మెటాలిక్‌ డ్రెస్‌లో రన్‌వేపై ఫ్యాన్స్​కు ప్లైయింగ్​ కిస్​లు ఇస్తూ స్టైల్‌గా నడిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. కాగా, మొదటి సారి పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొనడంపై అలియా భట్​ మాట్లాడుతూ ఐశ్వర్యారాయ్‌ తనకు స్ఫూర్తి అని చెప్పింది.

"తన అందంతో ఈ వేదికకు మరింత కళ తెచ్చిన ఐశ్వర్య రాయ్‌ అంటే నాకు ఎంతో స్ఫూర్తి. సినిమాల్లోనూ ఆమె డ్యాన్స్ చూసి చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆమె ఇప్పటికీ ఎంతో మందిని మంత్రముగ్దులను చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఐశ్వర్యా రాయ్‌ సాంగ్స్​ అని సెర్చ్‌ చేసి మరి చూస్తుంటాను. ఆమె డ్యాన్స్‌ మూమెంట్స్‌ అంటే నాకు ఎంతో ఇష్టం" అని అలియా భట్​ చెప్పుకొచ్చింది.

Aishwarya Rai Paris Fashion Week :ఇకపోతే ఏ ఈవెంట్​ అయినా సరే అలియా భట్ చెప్పినట్టుగానే ఐశ్వర్యా రాయ్​ తన డిఫరెంట్​ మోడ్రన్​ డ్రెస్​తో ఆ వేదికకే మరింత కళను తెప్పిస్తారు. అలా ఆమె అలియా భట్ పాల్గొన్న ఫ్యాషన్​ వీక్​లో రెడ్ కలర్ డ్రెస్​లో సందడి చేశారు. ఫ్యాన్స్​కు అభివాదం తెలుపుతూ ర్యాంప్​ వాక్ చేశారు. అలా మరోసారి తన అందం, లుక్​తో అభిమానులను ఫిదా చేశారు. ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

Aishwarya Rai Divorce :పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌కు కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ హాజరైంది. ఈ సమయంలో ఐశ్వర్య కెమెరాకు పోజులిచ్చింది. వివాహం సమయంలో అభిషేక్‌ బచ్చన్‌ ఇచ్చిన ఉంగరాన్ని ధరించి ఆమె ఫ్యాషన్‌ వీక్‌కు హాజరైందని ఫొటోలు చూస్తే అర్థమైంది. దీంతో గత కొద్ది రోజులుగా అభిషేక్​ - ఐశ్వర్యా రాయ్ విడాకులంటూ సాగుతున్న ప్రచారానికి తెరపడినట్టైంది.

Aliabhatt Upcoming Movies :అలియా భట్​ ప్రస్తుతం జిగ్రా అనే సినిమాలో నటించింది. విజయదశమి సందర్భంగా ఇది విడుదల కానుంది. తన తమ్ముడిని కాపాడుకునేందుకు ఓ అక్క ఎటువంటి పోరాటం చేసింది? అనేది ఈ సినిమా కథ. ఈ మూవీ కోసం అలియా యాక్షన్ సీక్వెన్స్​ కూడా చేసింది.

ఆగని 'దేవర' రికార్డులు జోరు - ఓవర్సీస్​లో మరో ఘనత - NTR Devara Pre Sales Record

సత్యం సుందరం ప్రమోషన్​లో 'ఖైదీ 2' అప్డేట్​ - హింట్​ ఇచ్చిన హీరో కార్తి - kaithi 2 Movie Update

Last Updated : Sep 24, 2024, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details