Adivi Sesh Dacoit Movie :'జీ 2' (గూఢచారి 2) తర్వాతటాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డెకాయిట్'. గతంలోనే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేయగా, అప్పుడే శ్రుతి హాసన్‌ను ఫీమేల్ లీడ్‌గా పరిచయం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రుతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
కానీ ఇప్పుడు శ్రుతి స్థానంలో మరో స్టార్ హీరోయిన్ను తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. శేష్ బర్త్‌డే సందర్భంగా ఆ నటి ఈ హీరోకు తన స్టైల్లో విషెస్ కూడా చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తాజాగా విడుదలైన ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
"ప్రేమించావు. కానీ మోసం చేశావు. విడిచిపెట్టను. ఇది తేలాల్సిందే" అంటూ శేష్ హీరోయిన్ గురించి రివీల్ చేయగా, దానికి 'వదిలేశాను. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అంటూ మృణాల్ రిప్లై ఇచ్చిన తీరు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
శేష్ అప్‌కమింగ్ మూవీస్ :
ఇక అడివి శేష్ అప్‌కమింగ్ మూవీస్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన 'డెకాయిట్'తో పాటు 'జీ2' మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. 'గూఢచారి'కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ మొత్తం భారత్‌లోనే జరగ్గా, 'జీ2'ని మాత్రం స్టోరీకి అనుగుణంగా అలాగే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సాధ్యమైనంత ఉన్నతంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్.
అందుకే ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్‌ను స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, పోలాండ్, ఇటలీ లాంటి దేశాల్లో షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.100 కోట్లని సమాచారం. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈయనకు సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ గతంలో విడుదల చేశారు.
2025లో శేష్ మేనియా - ఆ మూడు సినిమాలే టార్గెట్! - Adivi Sesh Upcoming Movies
'డైరెక్టర్‌ను అందుకే మార్చాం - ఇది శేష్ నిర్ణయం కూడా' - Adivi Sesh G2 Movie Director