Hema Committee Report Actress Minu Allegations on Mollywood Actors : మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఓ రిపోర్ట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఇప్పుడీ రిపోర్ట్ అంతటా చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలో పలువురు తారలు బయటకు వచ్చి ధైర్యంగా తమకు ఎదురైన పరిస్థితులు, చేదు అనుభవాల్ని గురించి మాట్లాడుతున్నారు. మరి వారు చెప్పే విషయాల్లో నిజం ఉన్నాయో లేదో తెలీదు కానీ, వారు చేసే కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా నటి మిను కూడా సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలియజేసింది. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన యాక్టర్స్ వల్ల తాను వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. ప్రముఖ నటుడు జయసూర్యతో పాటు మణియన్‌పిళ్ల రాజు, ముఖేశ్, ఇడవేల బాబు, ప్రొడక్షన్ కంట్రోలర్ నోబల్, విచు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరంతా తనను అసభ్య పదజాలంతో దూషించారని చెప్పింది. వారి వేధింపులు మితిమీరిపోవడంతో మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలి చెన్నైకు వెళ్లిపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్గా మారాయి.