Toyota Urban Cruiser Taisor Launch : టయోటా ఇండియా కంపెనీ తాజాగా ఇండియన్ మార్కెట్లో అర్బన్ క్రూయిజర్ టైజర్ కారును లాంఛ్ చేసింది. వాస్తవానికి ఇది ఒక మారుతి ఫ్రాంక్స్ బేస్డ్ క్రాసోవర్ కార్. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.7.73 లక్షలుగా ఉంది.
బుకింగ్స్ ప్రారంభం
Toyota Taisor Bookings :టయోటా కంపెనీ, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకితో సహకారంతో రూపొందించిన ఆరో కారు ఇది. ఇప్పటికే ఈ టయోటా టైజర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 2024 మే నెల నుంచి దీనిని డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది.
Toyota Taisor Design :ఈ టయోటా టైజర్ కారును మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా రూపొందించారు. కనుక డిజైన్ ఇంచుమించు అదే విధంగా ఉంటుంది. అయితే ఈ నయా ఎస్యూవీ కారు ముందు, వెనుక భాగాలను కాస్త అప్డేట్ చేశారు. ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్స్, ట్వీక్డ్ బంపర్స్, సరికొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్ అమర్చారు.
Toyota Taisor Features :ఈ టయోటా టైజర్ ఇంటీరియర్ థీమ్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. మంచి సీటింగ్ ఎరేంజ్మెంట్ చేశారు. ఇంకా దీనిలో వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, ఆంబియెంట్ లైటింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లేలను అమర్చారు.
Toyota Taisor Engine And Gearbox :ఈ టయోటా టైజర్‌లో మారుతి ఫ్రాంక్స్‌లో ఉపయోగించిన ఇంజిన్లనే అమర్చారు. 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్ పవర్ట్రైన్ 88 బీహెచ్పీ పవర్, 113 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనుసంధానమై ఉంటుంది.