Amazon Republic Day Sale 2025 : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా పండగ వేళ స్పెషల్ సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్, గృహోపకరణాల నుంచి ఫ్యాషన్, బ్యూటీ వంటి అనే కేటగిరీల వస్తువులపై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏ వస్తువుపై ఏమేం డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్స్
Apple iPhone 15 128GB : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్‌పై మంచి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఇంతకుముందు రూ.60,499 ఉన్న యాపిల్ ఐఫోన్ 15(128GB) సేల్‌లో ఆఫర్లో భాగంగా రూ.55,499కు లభిస్తోంది. యాపిల్ బయోనిక్ చిప్సెట్ సహా 48మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తోంది ఐఫోన్ 15.
Samsung Galaxy M35 5G : బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి సామ్సంగ్ ఫోన్లపై మంచి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. అందులో ముఖ్యంగా సామ్సంగ్ గెలాక్సీ ఎస్35 ఆఫర్లో భాగంగా రూ. 13,999 (బ్యాంక్ ఆఫర్లతో సహా) లభిస్తోంది. Galaxy M35 5G శామ్‌సంగ్ Exynos 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత One UI 6.1 ప్లాట్‌ఫామ్‌తో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
Oppo F27 Pro+ 5G : ఈ సేల్ 2025 సందర్భంగా Oppo F27 Pro+ 5G ధర రూ. 23,400కు (బ్యాంక్ ఆఫర్‌తో సహా) తగ్గింది. ఈ ఫోన్‌పై ఎక్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అమెజాన్ అందిస్తోంది. ఈ మొబైల్ 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్-14 ఆధారిత కలర్ఓఎస్ 14.0 ప్లాట్‌ఫామ్‌తో నడుస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్లో 8GB RAMతో శక్తిమంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ అమర్చారు.
ల్యాప్‌టాప్స్‌పై టాప్ డీల్స్
Lenovo IdeaPad Pro 5 : రిపబ్లిక్ డే సేల్‌లో లెనోవో ఐడియా ప్యాడ్ ప్రో5పై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. రూ.1,46,890 ఈ ల్యాప్‌టాప్ ధర ఆఫర్లో భాగంగా రూ. 1,03,990కు తగ్గింది. ఈ ల్యాప్‌టాప్ శక్తిమంతమైన ఇంటెల్ కోర్ అల్ట్రా9 ప్రాసెసర్, 32GB RAM, 1TB SSDతో వస్తోంది. 16అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగిన ఈ ల్యాప్‌టాప్‌లో 400nits బ్రైట్‌నెస్‌తో పనిచేసుకోవచ్చు. అయితే ఎక్ఛేంజ్‌లో ఆఫర్లో భాగంగా ఏదైనా పాత ల్యాప్ ఇస్తే రూ.17,350 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
Dell G15 : డెల్ జీ15 గేమింగ్ ల్యాప్‌టాప్‌పై 34శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రూ.1,05,398 ఉన్న ఈ ల్యాప్‌టాప్ ఆఫర్లో భాగంగా రూ.69,990కే అందుబాటులో ఉంది. ఎన్విడియా జీఫోర్స్ RTX 3050 గ్రాఫిక్స్ కార్డుతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ గేమర్స్, కంటెంట్ క్రియేటర్స్‌కు మంచి ఆప్షన్ అవుతుంది. 15.6 అంగుళాల డిస్‌ప్లే, కోర్ ఐ5 ప్రాసెసర్, 512GB హార్డ్ డిస్క్, 8GB RAMతో ఈ ల్యాప్‌టాప్ వస్తోంది.
Acer Nitro V : ఏసర్ నిట్రో వీ ల్యాప్‌టాప్‌పై 27శాతం డిస్కౌంట్ లభిస్తోంది. సేల్‌లో ల్యాప్‌టాప్ ధర రూ.89,999 నుంచి రూ.65,990కు తగ్గింది. ఏఎమ్‌డీ రైజెన్ ప్రాసెసర్‌తో వస్తున్న ల్యాప్‌టాప్ గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక ఏఐ అనుసంధానమైన జీఫోర్స్ ఆటీఎక్స్ గ్రాఫిక్స్ కార్డుతో అదిరిపోయే గేమింగ్ అనుభూతిని అందిస్తుంది. 15.6 అంగుళాల డిస్‌ప్లే, రైజెన్ 7 ప్రాసెసర్, 512GB హార్డ్ డిస్క్, 16GB RAMతో ఈ ల్యాప్‌టాప్ వస్తోంది. ఇవే కాకుండా ASUS TUF A15 (27శాతం), ASUS Vivobook 16X(30శాతం), HP Victus(27శాతం)పై మంచి డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
గృహోపకరణాలపై 65శాతం డిస్కౌంట్స్!
- స్పెషల్ సేల్‌లో ప్రముఖ బ్రాండ్లకు చెందిన వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు వంటి పెద్ద గృహోపకరణాలపై 65శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
- టీవీ, ప్రొజెక్టర్లపై వంటి వాటిపై 65శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
- మిక్సర్, గ్రౌండర్, ఎరిర్ఫయర్, వాటర్ ఫ్యూరిఫయర్ వంటి వాటిపై 35 శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
- బెడ్స్, టేబుల్స్, సోఫా వంటి ఫర్నిచర్ ఐటెమ్స్‌పై 50శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.