తెలంగాణ

telangana

కొనసాగుతున్న బుల్​ జోరు - లైఫ్​ టైమ్ హై లెవెల్స్ క్రాస్​ చేసిన సెన్సెక్స్ & నిఫ్టీ - Stock Market Today

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Stock Market
Stock Market (Getty Images)

Stock Market Today September 23, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా రికార్డ్ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎర్లీ ట్రేడింగ్​లో సెన్సెక్స్​, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాలను తాకాయి. విదేశీ పెట్టుబడులు పెరగడం, ఆసియా మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 295 పాయింట్లు వృద్ధిచెంది 83,839 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 25,906 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ :ఎస్​బీఐ, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్​, భారతీ ఎయిర్​టెల్​, ఎన్​టీపీసీ, అదానీ పోర్ట్స్​, కోటక్​ బ్యాంక్​, టాటాస్టీల్​, రిలయన్స్​, టైటాన్
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఐసీఐసీఐ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, యాక్సిస్ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​, ఎల్​ అండ్ టీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్​

LIVE FEED

10:48 AM, 23 Sep 2024 (IST)

రాణిస్తున్న ఆటో, పీఎస్​యూ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఉదయం జీవనకాల గరిష్ఠాలను తాకాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగడం, ఆసియా మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుండడమే అందుకు కారణం. ప్రస్తుతం ఆటో, పీఎస్​యూ, ఆయిల్​ అండ్ గ్యాస్​ రంగ షేర్లు రాణిస్తున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 318 పాయింట్లు పెరిగి 84,862 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 120 పాయింట్లు వృద్ధి చెంది 25,911 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ హై రికార్డ్​ను క్రాస్ చేసింది.

అదే కారణం!
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) శుక్రవారం రూ.14,064.05 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్ 18న కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం వల్ల మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్​మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలిపారు.

ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై, హాంకాంగ్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి.

ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.75 శాతం పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 75.05 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్​ లో రూపాయి విలువ 5 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.47గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details