దీపావళి సందర్భంగా జరిగిన మూరత్ ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సాయంత్రం 6 గంటల నుంచి గంట పాటు సాగిన ట్రేడింగ్‌లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ 335 పాయింట్ల లాభంతో 79,724 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 94 పాయింట్లు లాభపడి 24,304 వద్ద స్థిరపడింది.
దీపావళి స్పెషల్ మూరత్ 'ట్రేడింగ్'- లాభాల్లో ముగిసిన సెన్సెక్స్@79,724, నిఫ్టీ - MUHURAT TRADING 2024
Published : Nov 1, 2024, 5:23 PM IST
|Updated : Nov 1, 2024, 7:23 PM IST
Muhurat Trading 2024 : దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం సాయంత్రం జరిగిన ముహురత్ ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. కొత్త సంవత్ 2081 ప్రారంభానికి గుర్తుగా దీపావళి నాడు ఒక గంట సేపు ప్రత్యేకంగా ఈ ముహురత్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించారు.
LIVE FEED
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
'మూరత్ ట్రేడింగ్' - లాభాల్లో కొనసాగుతోన్న సూచీలు
- దీపావళి సందర్భంగా స్టాక్‌మార్కెట్‌లో మూరత్ ట్రేడింగ్
- 400 పాయింట్లకుపైగా లాభాల్లో సెన్సెక్స్
- 100 పాయింట్లకుపైగా లాభాల్లో నిఫ్టీ
ప్రారంభమైన మూరత్ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లలో ప్రతి ఏటా ప్రత్యేకంగా నిర్వహించే మూరత్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ముంబయిలోని నేషనల్ స్టాక్ ఎక్చేంజీ(ఎన్ఎస్ఈ) మూరత్ ట్రేడింగ్‌తో పాటు బెల్ రింగింగ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో 'ది సబర్మతి రిపోర్ట్' నటీనటులు రాశి ఖన్నా, రిధి డోగ్రా, విక్రాంత్ మాస్సే పాల్గొన్నారు.
-
#WATCH | 'Muhurat Trading' and bell ringing ceremony at National Stock Exchange (NSE) in Mumbai, Maharashtra.
— ANI (@ANI) November 1, 2024
On this occasion, the star cast of 'The Sabarmati Report' - Raashii Khanna, Riddhi Dogra and Vikrant Massey joined the ceremony. pic.twitter.com/yUOU2yazgh
2024 మూరత్ ట్రేడింగ్ సమయం
Muhurat Trading 2024 Live Updates : దీపావళి నుంచి తదుపరి దీపావళి వరకు కాలాన్ని సంవత్‌గా వ్యవహరిస్తారు. 2080 సంవత్ ట్రేడింగ్ పూర్తయింది. శుక్రవారం 2081 సంవత్ ప్రారంభం అయింది. స్టాక్ మార్కెట్‌లో దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే, మళ్లీ వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది మదుపర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రతి ఏడాది దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు కొనసాగుతుంది. దీనికి తోడు 15 నిమిషాల పాటు ప్రీ మార్కెట్ సెషన్ ఉంటుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలే సమయాన్ని నిర్ణయిస్తాయి. ధన త్రయోదశి నాడు ఎలాగైతే కనీసం ఒక్క గ్రాము బంగారం అయినా కొనాలనుకుంటారో, ఈ సమయంలో కూడా కనీసం ఒక్క స్టాక్ అయినా కొనాలని చాలామంది ట్రేడర్ల సెంటిమెంట్. దీపావళి రోజు స్టాక్ బ్రోకింగ్ కార్యాలయాలన్నీ దీపకాంతుల్లో వెలిగిపోతుంటాయి.
2024 మూరత్ ట్రేడింగ్ సమయం :
- మార్కెట్ ఓపెన్ - సాయంత్రం 6 గంటలకు
- మార్కెట్ క్లోజ్ - సాయంత్రం 7 గంటలకు
- ట్రేడ్ మాడిఫికేషన్ ముగింపు సమయం - సాయంత్రం 7:10 గంటలకు
ఫస్ట్ మూరత్ ట్రేడింగ్ అప్పుడే!
మూరత్ ట్రేడింగ్ అనేది దాదాపు 6 దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. మూరత్ ట్రేడింగ్‌ను మొదట బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1957లో ప్రారంభించారు. ఆ తర్వాత 1992లో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపించినప్పుడు అదే ఏడాది ఈ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ ట్రేడింగ్‌తో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు. సంపదకు, ధనానికి దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తూ మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మూరత్‌ను మంచి సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఏ పని చేపట్టినా మంచి ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.
మదుపర్లు ఇవి దృష్టిలో పెట్టుకోవాలి..
- చాలా మంది ట్రేడర్లు, మదుపర్లు కేవలం సెంటిమెంటు కోసం మాత్రమే లావాదేవీలను నిర్వహిస్తారు.
- ట్రేడింగ్ ముగిసే సమయానికి ఓపెన్‌గా ఉన్న పొజిషన్లకు సెటిల్‌మెంట్ నిబంధనలు వర్తిస్తాయి.
- ట్రేడర్లు నిరోధం(రెసిస్టెన్స్), మద్దతు(సపోర్ట్) స్థాయిలను క్షుణ్నంగా పరిశీలించుకోవాలి.
- కంపెనీ ఫండమెంటల్స్‌ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ట్రేడింగ్ చేయాలి. మీ దీర్ఘకాల పెట్టుబడి ప్రణాళికల ప్రకారం స్టాక్స్‌ను కొనుగోలు చేయాలి.
- అయితే ఈ రోజు కొన్న స్టాక్ కచ్చితంగా రాబడి ఇస్తుందని నమ్మకం లేదు. లాభాలు పూర్తిగా ఆ కంపెనీ పనితీరుపైన మాత్రమే ఆధారపడి ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి.
గమనిక : స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి నష్టభయంతో కూడుకొన్న అంశం. కాబట్టి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.