ETV Bharat / state

ప్రయాణికులకు విజ్ఞప్తి : జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు - SCR TRAIN TIMINGS CHANGES

జనవరి 1వ తేదీ నుంచి రైళ్ల ప్రయాణ వేళ్లల్లో మార్పులు - ఉత్తమ సేవలు కోసం మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడి

SCR Train Timings Changes
South Central Railway Train Timings Changes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2024, 8:41 PM IST

Updated : Dec 31, 2024, 9:46 PM IST

South Central Railway Will Changes Train Timings : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి కొత్త రైల్వే పబ్లిక్ టైమ్ టేబుల్ అమలులోకి రాబోతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు, రైల్వే సర్వీసులను మెరుగుపరిచేందుకు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులుచేసినట్లు తెలిపింది.

జనవరి 1 నుంచి ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు వాస్తవ రైలు సమయాలను సరిచూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత రైల్వే స్టేషన్​ల్లో ఐఆర్​సీటీసీ వెబ్‌సైట్ (www.irctc.co.in), నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ పోర్టల్​లో అందుబాటులో ఉంటుందని సూచించింది. సంబంధిత రైల్వే స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చని తెలిపింది.

15 నిమిషాల ముందుగానే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌

ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఇక నుంచి విజయవాడ స్టేషన్‌లో 15 నిమిషాల ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్‌ ప్రకారం అయితే విజయవాడ స్టేషన్‌ నుంచి రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్​ ఉదయం 6.15 గంటలకు బయలుదేరుతుంది. కొత్తగా వచ్చిన షెడ్యూల్‌ ప్రకారం 15 నిమిషాల ముందుగానే అంటే ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. ప్రతిరోజూ విజయవాడ నుంచి విశాఖ వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు భారీ సంఖ్యలో ప్రయాణిస్తుంటారు.

ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాల్లోనూ మార్పులు

ఎంఎంటీఎస్‌ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ జనవరి 1వ తేదీ నుంచి మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 88 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఈ మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

సికింద్రాబాద్‌ నుంచి 'మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర' - మరో పర్యాటక రైలును ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

మీరు ప్రయాణించే రైలు ఆలస్యంగా వెళ్తుందా? - ఇలా చేస్తే నష్టపరిహారం పొందొచ్చు!

Last Updated : Dec 31, 2024, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.