Risks of Not Washing your Hands: మన చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనేక రోగాల నుంచి తప్పించుకోవచ్చని చాలా మందికి తెలుసు. అయినా సరే- ఈ విషయంలో ఒక్కోసారి అశ్రద్ధ వహిస్తుంటాం. ముఖ్యంగా బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు జస్ట్ అలా నీళ్లు పోసుకుని పైపైన చేతులు కడుక్కుంటాం. అయితే, ఇలా చేయడం వల్ల చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరతాయట! ఫలితంగా సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సలహా ఇస్తున్నారు.
![Risks of Not Washing your Hands](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23518687_risks_of_not_washing_hands-3.jpg)
- ఓ అధ్యయనం ప్రకారం సరిగ్గా చేతులు కడుక్కోకపోవడం వల్ల ఏటా పది లక్షల మంది వివిధ అనారోగ్యాలతో ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది.
- చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెళతాయి. ఇంకా ఈ అపరిశుభ్ర చేతులతోనే ఇతరులను తాకితే వారికి కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి.
- ఇక మొబైల్, టీవీ రిమోట్, తలుపులు, కిటికీలు, డైనింగ్ టేబుల్‌పై కూడా వ్యాధికారక క్రిములుంటాయి. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి కచ్చితంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
- ముఖ్యంగా చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
- చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రమాదకర కంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.
![Risks of Not Washing your Hands](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23518687_risks_of_not_washing_hands-1.jpg)
చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ!
ముఖ్యంగా చిన్నారులు, ఇంకా స్కూలుకు వెళ్లే పిల్లల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల చేతులు శుభ్రంగా లేకపోతే వారికి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. డయేరియా లాంటి అతిసార వ్యాధుల కారణంగా ఏటా సుమారు 1.8 మిలియన్ల మంది చిన్నారులు మరణిస్తున్నారు. అందులో ఐదేళ్ల లోపు చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. పిల్లల చేతులు పరిశుభ్రంగా ఉంచడం వల్ల 10 మంది చిన్నారుల్లో కనీసం నలుగురు చిన్నారులను ఈ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని అధ్యయనాలు వివరిస్తున్నాయి. 2017 Journal of Infectious Diseasesలో ప్రచురితమైన "Hand Hygiene and Diarrheal Disease" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఎగ్స్ ఆరోగ్యానికి మంచివా కావా?
ఫిట్‌గా ఉండాలని ఎన్నో వర్కౌట్లు చేస్తున్నారా? సింపుల్‌గా పాకితే సరిపోతుందట!