ETV Bharat / state

సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు - ఆ తేదీల్లో నడపనున్నట్లు టీజీఎస్ ​ఆర్టీసీ వెల్లడి - TGSRTC SPECIAL BUSES

సంక్రాంతి పండగ సందర్భంగా 6,432 ప్రత్యేక బస్సులను నడపనున్న టీజీఎస్​ఆర్టీసీ - జనవరి 9 నుంచి 15 వరకు అందుబాటులో ఉండనున్న ప్రత్యేక బస్సులు

TGSRTC SPECIAL BUSES
TGSRTC Special Buses in Sankranti festival (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2024, 7:54 PM IST

Updated : Dec 31, 2024, 8:42 PM IST

TGSRTC Special Buses in Sankranti festival : సంక్రాంతి పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు టీజీఎస్​ఆర్టీసీ ప్రకటించింది. గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 5,246 బస్సులను సంస్థ నడిపింది. గత సంక్రాంతి అనుభవం దృష్ట్యా ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. జనవరి 9వ తేది నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది.

హైదరాబాద్​లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఏపీకీ ప్రతిరోజు 200ల టీజీఎస్ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వాటికి అదనంగా మరో 100 బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగుపయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా టీజీఎస్ ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి ఆపరేషన్స్ టీజీఎస్‌ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు పూర్తిగా సన్నద్ధం కావాలని క్షేత్రస్థాయి అధికారుల‌కు ఇప్పటికే ఆ సంస్థ యాజమాన్యం సూచించింది.

మహిళలకు ఉచిత బస్సు అమల్లోనే ఉంటుందని స్పష్టం : హైదరాబాద్​లోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్​ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్​ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని తెలిపింది.

తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సంస్థ స్పష్టం చేసింది. ప్రైవేట్‌ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకు సూచిస్తోంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్​ను www.tgsrtcbus.in వెబ్ సైట్​లో చేసుకోవాలని పేర్కొంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.

Last Updated : Dec 31, 2024, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.