Stock Market Close Today November 25, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం సహా, బ్యాంకింగ్, ఆయిల్ & గ్యాస్, రియాలిటీ షేర్లు రాణించడమే ఇందుకు కారణం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 992 పాయింట్లు లాభపడి 80,109 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 314 పాయింట్లు వృద్ధి చెంది 24,221 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, టీసీఎస్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ
- నష్టపోయిన షేర్లు : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఏసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,278.37 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.