Horoscope Today January 16th 2025 : 2025 జనవరి 16వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగతంగా కొన్ని పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. సమావేశాలలో మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకర్షిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఆర్థికంగా అనూహ్య లాభాలు ఉండవచ్చు. సామాజికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగవుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ శ్రేయస్కరం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పట్టుదలతో కృషిచేసి వృత్తి, ఉద్యోగాలలో మీకంటూ గుర్తింపు సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం ఆశించిన మేరకు పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అపారమైన విజయాలను అందుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి పాత పరిచయాలు పనికొస్తాయి. సమావేశాలు, చర్చలలో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. లక్ష్యసాధనలో ఆటంకాలు చికాకు పెడతాయి. మనోబలం కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు. కుటుంబం కలహాలు మనశ్శాంతికి భంగం కలిగిస్తాయి. కీలక విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సంతానం అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలను పట్టుదలతో అధిగమిస్తారు. ప్రయాణాల్లో సమస్యలు ఉండవచ్చు. గృహాలంకరణ కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలతో ఈ రోజంతా ఆధ్యాత్మికంగా గడుపుతారు. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు ఆనందం కలిగిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. కోపావేశాలు అదుపులో ఉంచుకువాలి. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందం నింపుతుంది. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. కుటుంబంతో విహారయాత్రకు వెళ్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి లాభదాయకంగా ఉంటుంది. సేవా రంగంలో పని చేసే వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. పదోన్నతులు, జీతాలు పెరగడం వంటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, మిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. శనిధ్యానం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌కు సంబంధించి ఈ రోజు మంచి రోజు. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. శివారాధన శ్రేయస్కరం.