Petrol Attack in Secunderbad : సికింద్రాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తమ కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న కోపంతో ప్రదీప్ అనే వ్యక్తి ఇంటిపై యువతి బాబాయ్, తల్లి పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో అతని తల్లిదండ్రులు ప్రకాష్,హేమలతలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అదే క్రమంలో అక్కడే ఉన్న నాలుగేళ్ల చిన్నారి చాందినిపై పెట్రోల్ పడడంతో ఆమె కాలిపై స్వల్పంగా గాయాలయ్యాయి.
పెట్రోల్‌తో దాడి : పెట్రోల్ దాడిలో 50 శాతం గాయపడిన యువకుడి తండ్రి ప్రకాష్‌ను హుటాహుటిన సమీపంలోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాక్షికంగా కాలిన గాయాలతో హేమలత బయటపడగా చిన్నారి సైతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ప్రదీప్ ఇంటికి వచ్చిన నందకుమార్, లక్ష్మీలతో మరికొందరు యువకులు వారి వెంట తెచ్చిన పెట్రోల్ బాటిల్‌ను ఇంట్లో వారిపై చల్లి నిప్పంటించారు.
దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు : ఈ ఘటన జరిగిన సమయంలో ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎంటమాలజీ విభాగంలో పని చేస్తున్న ప్రదీప్.. నందకుమార్, లక్ష్మిల కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కోపంతో అతనిపై దాడి చేయాలని భావించి వారి కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
భూ వివాదం - సమీప బంధువుపై ట్రాక్టర్ కేజివిల్తో దాడి
న్యూ ఇయర్ పార్టీ కోసం గోవా వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ - కర్రలతో కొట్టి దారుణ హత్య