Traffic in Panthangi Toll Plaza : సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు మళ్లీ పట్నం బాట పట్టారు. ఉత్సాహంగా గతవారం ఊళ్లకు బయలుదేరిన పల్లెవాసులు, సంక్రాంతిని ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో జరుపుకుని తమ ఉద్యోగాల రిత్యా తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ క్రమంగా పెరిగింది. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
తీవ్రంగా రద్దీ ఉంటుందని అంచనా : మెల్లగా రద్దీ పెరుగుతుండటంతో 12 టోల్ బూత్‌ల ద్వారా ఏపీ నుంచి తెలంగాణకు వాహనాలను హైదరాబాద్ వైపుగా పంపుతున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేశారు. రేపు రద్దీ తీవ్రంగా ఉంటుందని అక్కడి ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
విద్యాసంస్థలు ప్రారంభం : గత శనివారం (జనవరి 12) నుంచి పంతంగి టోల్ గేట్ వద్ద గంటకు సుమారు 900కు పైగా వాహనాలు ఏపీ వైపునకు వెళ్లాయి. తిరిగు ప్రయాణంలో కూడా అదే రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని కాలేజీలు 17 నుంచి ప్రారంభం అవుతుండగా, 18 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఆదివారం (జనవరి 19) వరకు జాతీయ రహదారిపై ఈ రద్దీ ఇలాగే కొనసాగుతుందని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు.
పట్నం ఖాళీ అవుతోంది : హైదరాబాద్ - విజయవాడ రహదారిపై నిమిషానికి 330 వాహనాలు
హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు