Apple TV+ Free Streaming: టెక్ దిగ్గజం యాపిల్ తన 'యాపిల్ TV+' సర్వీస్‌లో ఒరిజినల్ షోస్‌పై ఉచిత స్ట్రీమింగ్‌ను ప్రకటించింది. దీంతో ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండానే 'యాపిల్ TV+' యాక్సెస్‌ను పొందొచ్చు. అంతేకాక ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో అవార్డ్ విన్నింగ్ కంటెంట్‌ను కూడా పూర్తి ఉచితంగా చూడొచ్చు. అయితే యాపిల్ ప్రకటించిన ఈ ఆఫర్ లిమిటెడ్ కాలం వరకు మాత్రమే ఉండనుంది.
కంపెనీ తన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'యాపిల్ TV+' ప్రమోషన్లో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ సెవెరెన్స్ సీజన్ 2, మిథిక్ క్వెస్ట్, ప్రైమ్ టార్గెట్ వంటి కొత్త ఒరిజినల్ టైటిల్స్ రిలీజ్‌కు ముందు వస్తుంది. ఇవన్నీ జనవరి 2025లో ప్రీమియర్ కానున్నాయి.
ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులో?: 2025 జనవరి 4 నుంచి జనవరి 5వ తేదీ వరకు వినియోగదారులు యాపిల్ ఒరిజినల్స్‌ను ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండానే స్ట్రీమ్ చేయొచ్చని యాపిల్ ప్రకటించింది. ఆ సమయంలో యూజర్లు 'యాపిల్ TV+' యాప్‌ను ఓపెన్ చేసి కంటెంట్‌ను ఉచితంగా చూడొచ్చు. 'యాపిల్ TV+' యాప్ యాపిల్ డివైజ్‌లలో ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు అయితే దీన్ని 'గూగుల్ ప్లే స్టోర్' నుంచి కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
తన 'TV+' సర్వీసుల కోసం యాపిల్ ఇతర ప్రమోషన్‌లను కూడా అమలు చేస్తుంది. ఇందులో భాగంగా కొత్త యాపిల్ డివైజ్‌లను కొనుగోలు చేసినప్పుడు 3 నెలల పాటు ఈ ప్లాట్‌ఫామ్‌కు ఉచిత యాక్సెస్ అందిస్తుంది. అంతేకాకుండా 'యాపిల్ టీవీ+' పెయిడ్ సబ్‌స్క్రైబర్ కావాలనుకుంటే.. నెలకు రూ.99 నెలవారీ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే ముందు యాప్‌ను ఏడు రోజుల పాటు ట్రయల్ వేసే సదుపాయాన్ని కూడా అందిస్తుంది.
వీటితో పాటు నెలకు రూ.195లతో 'యాపిల్ వన్' ప్లాన్‌ను కూడా తీసుకోవచ్చు. ఇది మనకు 200GB iCloud స్టోరేజ్, 'Apple Music', 'Apple Arcade'లకు యాక్సెస్ ఇస్తుంది. ముఖ్యంగా 'Apple Music' స్టూడెంట్ ప్లాన్ 'Apple TV+' కోసం ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.
This weekend, see for yourself.
— Apple TV (@AppleTV) December 30, 2024
Stream for free Jan 4-5. pic.twitter.com/8p6PCUYpms
ఎయిర్‌టెల్ యూజర్లకూ యాపిల్ సబ్‌స్క్రిప్షన్: మన దేశంలో సెట్ చేసిన ప్రీపెయిడ్, పోస్పెయిడ్ ప్లాన్ల ద్వారా ఎయిర్‌టెల్ వినియోగదారులూ యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ+ సబ్‌స్క్రిప్షన్‌లను పొందొచ్చు. ఈ సబ్స్క్రిప్షన్లు.. ఎయిర్‌టెల్ ప్రీమియం WiFi ప్లాన్లు, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో కలిపి వస్తాయి. అదనంగా మొబైల్ వినియోగదారులు ఎయిర్‌టెల్ వింక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో పాటు యాపిల్ మ్యూజిక్‌కు సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
యాపిల్ లవర్స్‌కు క్రేజీ అప్డేట్- త్వరలో మార్కెట్లోకి మొట్ట మొదటి ఫోల్డబుల్ ఐఫోన్!
2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? అవి ఏ రాశులపై ప్రభావం చూపిస్తాయి?
టెంపరేచర్‌ను బట్టి కలర్స్ మార్చే స్మార్ట్‌ఫోన్- దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడో తెలుసా?
వారెవ్వా.. రోల్స్ రాయిస్ కొత్త కారు ఏం ఉంది భయ్యా!- ఒక్క చూపుకే ఫిదా అయిపోవడం ఖాయం!