ETV Bharat / health

ఆర్థరైటిస్​కు పసుపు మందు! - పరిశోధనలో కీలక విషయాలు - HEALTH BENEFITS OF TURMERIC

- పసుపుతో పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు - కీళ్ల నొప్పులకు మేలు చేస్తుందంటున్న నిపుణులు

Health Benefits of Turmeric
Health Benefits of Turmeric (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2024, 4:00 PM IST

Health Benefits of Turmeric : పసుపులోని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో రకాల వ్యాధులు, ఇన్​ఫెక్షన్లు, పలు ఆరోగ్య సమస్యలకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అందుకే.. డైలీ మనం చేసుకునే అన్ని వంటకాల్లో పసుపును వినియోగిస్తుంటాం. ఆయుర్వేదంలో కూడా పసుపునకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే కేవలం పసుపు వల్ల మాత్రమే కాకుండా.. పసుపు సప్లిమెంట్స్​ తీసుకున్నా పలు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్​, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయని అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

పరిశోధన వివరాలివే: పసుపు.. అల్లం జాతికి చెందినది. పసుపు వంటల్లో వాడే సుగంధ ద్రవ్యమే కాకుండా ఎన్నో రకాల వ్యాధుల్ని ఎదుర్కొనే దివ్య ఔషధం కూడా. ఇది శ్వాసకోశ వ్యాధులకు చక్కటి మందులా పనిచేస్తుందని అంటున్నారు. పసుపులోని కర్కుమిన్ ఆస్టియో ఆర్థరైటిస్​, రుమటాయిడ్ ఆర్థరైటిస్​ వ్యాధి ఉన్న వారికి మంచిదంటున్నారు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని. ముఖ్యంగా జాయింట్లు పట్టేసినట్లు ఉండకుండా ఉంటాయని అంటున్నారు.

అయితే.. పసుపు కన్నా పసుపు సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనం మరింత ఎక్కువని అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా మనం తీసుకునే పసుపులో 2 నుంచి 9 శాతం వరకు మాత్రమే కర్కుమిన్​ ఉంటుందని.. అదే పసుపు సప్లిమెంట్స్​లో కర్కుమిన్​ 95 శాతం వరకు ఉంటుందని హార్వర్డ్​ మెడికల్​ స్కూల్​ వెబ్​సైట్​ ఓ రిపోర్టు ప్రచురించింది (రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి). ఈ క్రమంలోనే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను నియంత్రించడానికి రోజుకు రెండుసార్లు కర్కుమిన్ సప్లిమెంట్స్​ను 500 mg మోతాదులో తీసుకోవచ్చని "ఆర్థరైటిస్ ఫౌండేషన్" కూడా సిఫార్సు చేస్తోంది(రిపోర్ట్​ కోసం క్లిక్​ చేయండి).

పసుపు సప్లిమెంట్స్​ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

  • యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు: కర్కుమిన్ అనే యాంటి ఆక్సిడెంట్​.. శరీరంలోని కణాలను నష్టం నుంచి రక్షిస్తుందని అంటున్నారు. అలాగే చిన్న వయసులో వచ్చే వృద్ధాప్యాన్ని నిరోధించడానికి, కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించడానికి సహాయపడుతుందని అంటున్నారు.
  • మెదడు ఆరోగ్యానికి మంచిది: పసుపు మెదడులోని నరాల కణాలను రక్షిస్తుందని, అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంటున్నారు.
  • జీర్ణ వ్యవస్థకు మంచిది: పసుపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు. అలాగే పేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుందని.. ఇది IBS (Irritable Bowel Syndrome) వంటి జీర్ణ సమస్యలకు చికిత్సలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

పసుపు సప్లిమెంట్స్​ ఎవరు తీసుకోకూడదు: పసుపు సప్లిమెంట్స్‌ను అన్ని వయసుల వారు తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే గర్భవతులు, పాలిచ్చే తల్లులు, కీమోథెరపీ చేయించుకుంటున్నవారు, కొన్ని రకాల మందులు వాడే వారు వైద్యుని సలహా మేరకు తీసుకోవడం మంచిదంటున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కూరల్లో పసుపు వేస్తున్నారా? అతిగా వాడితే అనేక వ్యాధులు వస్తాయట జాగ్రత్త! మరి ఎంత వేయాలి?

మీరు ఉపయోగించే "పసుపు" స్వచ్ఛమైనదేనా ? - ఓ సారి ఇలా చెక్​ చేసి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.