ETV Bharat / business

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్​ - స్టాక్ మార్కెట్స్ క్రాష్ - సెన్సెక్స్​ 942 పాయింట్లు డౌన్

Stock Market Today
Stock Market Today (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 11:28 AM IST

Updated : Nov 4, 2024, 4:17 PM IST

Stock Market Today : అమెరికా అధ్యక్ష ఎన్నికలు- దేశీయ స్టాక్​ మార్కెట్ల ట్రేడింగ్​పై తీవ్ర ప్రభావం చూపాయి. సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి.

LIVE FEED

4:14 PM, 4 Nov 2024 (IST)

Stock Market Close Today November 4, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 942 పాయింట్లు పతనమై మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయి 24,000 దిగువన ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్​, బ్యాంక్ షేర్స్ భారీగా నష్టపోవడమే ఇందుకు కారణం.

చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 941 పాయింట్లు నష్టపోయి 78,782 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 309 పాయింట్లు కోల్పోయి 23,995 వద్ద ముగిసింది.

  • లాభపడిన షేర్లు : ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, ఎస్​బీఐ, హెచ్​సీఎల్ టెక్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఇన్ఫోసిస్​
  • నష్టపోయిన షేర్లు : అదానీ పోర్ట్స్​, రిలయన్స్​, ఎన్​టీపీసీ, యాక్సిస్ బ్యాంక్​, సన్​ఫార్మా, టాటా మోటార్స్​, టైటాన్​, పవర్​గ్రిడ్​, టాటా స్టీల్​, నెస్లే ఇండియా, ఐటీసీ

నష్టాలకు కారణాలు ఇవే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్ సూచీలపై పడింది. పైగా ఈ వారంలో యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు వేచి చూడడమే బెటర్ అనే ధోరణిలో ఉన్నారు. ఇది కూడా స్టాక్ మార్కెట్​ను దెబ్బతీసింది.

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్​-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. దీని వల్ల ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి పెంచడానికి ఏమాత్రం సుముఖంగా లేవు. ఇది కూడా స్టాక్ మార్కెట్లపై పరోక్షంగా ప్రభావం చూపించింది. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 2.57 శాతం పెరిగింది. దీనితో బ్యారెల్ ముడిచమురు ధర 74.98 డాలర్లకు చేరింది.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.211.93 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. వాస్తవానికి అక్టోబర్ నెల మొత్తాన్ని తీసుకుంటే ఎఫ్​ఐఐలు ఏకంగా రూ.94,000 కోట్ల వరకు తమ పెట్టుబడులను దేశం నుంచి ఉపసంహరించుకున్నారు. చైనా స్టాక్ మార్కెట్లో రాబడికి మంచి అవకాశాలు ఉండడమే ఇందుకు కారణం.

రూపాయి విలువ
సోమవారం రూపాయి విలువ భారీగా పతనమై జీవితకాల కనిష్ఠాల వద్ద ముగిసింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.11గా ఉంది. దీని వల్ల డాలర్​కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ మరింత పతనం అవుతోంది. ఇది నేరుగా భారత విదేశీ కరెన్సీ రిజర్వ్​లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

3:38 PM, 4 Nov 2024 (IST)

సెన్సెక్స్ 942 పాయింట్స్​, నిఫ్టీ 309 పాయింట్స్ డౌన్​

Stock Market Close Today November 4, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్ సూచీలపై పడింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపరులు భారీగా పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఉండడం మదపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది.

చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 942 పాయింట్లు నష్టపోయి 78,782 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 309 పాయింట్లు కోల్పోయి 23,995 వద్ద ముగిసింది.

ఈ వారంలో యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు వేచి చూడడమే మంచిది అనే ధోరణిలో ఉన్నారు. ఇది కూడా స్టాక్ మార్కెట్​ను దెబ్బతీసింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్​-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. దీని వల్ల ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి పెంచడానికి ఏమాత్రం సుముఖంగా లేవు. ఇది కూడా స్టాక్ మార్కెట్లపై పరోక్షంగా ప్రభావం చూపించింది.

12:22 PM, 4 Nov 2024 (IST)

విదేశీ సంస్థాగత మదుపరులు అమ్మకాలకు దిగడం వల్ల సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు నెత్తురోడాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు ఈ వారంలో యూఎస్​ ఫెడరల్​ రిజర్వ్​ వడ్డీ రేటు నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో- మదపరులు వేచిచూసే ధోరణి అవలంభించారు. ఈ కారణాల వల్ల ఉదయం ఒక దశలో బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్​ దాదాపు 1200 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఇన్వేస్టర్ల సంపద రూ.7.37 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెట్​ కంపెనీల మార్కెట్​ విలువ రూ. 4,40,72,863.01 కోట్లకు (USD 5.24 ట్రిలియన్లు) చేరుకుంది.

వీదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్​లో దేశీయ స్టాక్​ మార్కెట్ల నుంచి రూ.94 వేల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దేశీయ ఈక్విటీల ఎలివేటెడ్​ వ్యాల్యుయేషన్, చైనా స్టాక్​ మార్కెట్​ ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్​ కారణంగా పెట్టుబడుల ఔట్​ఫ్లో కొనసాగింది. దీంతో ఔట్​ఫ్లో పరంగా అక్టోబర్​ అత్యంత చెత్త నెలగా నిలిచింది.

లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్స్​
బీఎస్​ఈ సెన్సెక్స్​ సూచీ- టెక్​ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్​సీఎల్ టెక్

నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్స్​
బీఎస్​ఈ సెన్సెక్స్​ సూచీ- సన్​ ఫార్మా, అదానీ పోర్ట్స్​, ఎన్​టీపీసీ, బజాజ్​ ఫిన్​సెర్వ్, రిలయన్స్​

ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్​, షాంఘై, హాంకాంగ్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. శక్రవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి.

గ్లోబర్ ఆయిల్​ బెంచ్​మార్క్​ ప్రకారం బ్రెండ్​ క్రూడ్​ ధర బ్యారెల్​కు 1.56శాతం పెరిగి 4.24 డాలర్లకు చేరుకుంది.

Last Updated : Nov 4, 2024, 4:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.