ETV Bharat / business

రతన్‌ టాటా అంత్యక్రియలు- పార్సీ మతస్థుడైనప్పటికీ ఎలక్ట్రిక్‌ విధానంలో!

ratan tata passed away
ratan tata passed away (ANI (File Photo))
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2024, 6:39 AM IST

Updated : Oct 10, 2024, 9:46 PM IST

Ratan Tata Death LIVE Updates : దిగ్గజ పారిశ్రామికవేత్త​, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ స్వయంగా ప్రకటించారు. రతన్‌ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లీ శ్మశానవాటికలో జరిగాయి.

LIVE FEED

9:44 PM, 10 Oct 2024 (IST)

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. అనంతరం గురువారం సాయంత్రం అక్కడ నుంచి వర్లీ వరకు కొనసాగిన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. వర్లీ శ్మశానవాటికలో రతన్‌ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అయితే, పార్సీ మతస్థుడైనప్పటికీ ఎలక్ట్రిక్‌ విధానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

భిన్న సంప్రదాయం
హిందూ, ముస్లింల మాదిరి కాకుండా పార్సీల అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి. మానవ శరీరాన్ని ప్రకృతి బహుమతిగా భావిస్తారు. అందుకే శరీరాన్ని తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. దహనం, ఖననం చేయడం వల్ల ప్రకృతి వనరులైన నీరు, గాలి, అగ్ని కలుషితం అవుతాయని జొరాస్ట్రియన్‌ల విశ్వాసం. అందుకే ప్రత్యేక విధానంలో అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలకు ముందు పార్సీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు. దాన్ని టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ లేదా దఖ్మా అని పిలుస్తారు. రాబందులు వచ్చి తినేందుకు వీలుగా ఆ ప్రదేశంలో పార్థివదేహాన్ని ఉంచుతారు. ఈ మొత్తం పద్ధతిని దోఖ్‌మేనాశీనిగా పేర్కొంటారు. మన దేహం ప్రకృతి నుంచి వచ్చింది అలాగే తిరిగి ఐక్యమవ్వాలని వీరి ఆశయం.

రాబందులు లేకపోవడమూ!
పార్సీల సంప్రదాయం ఇలా ఉన్నప్పటికీ మారుతున్న పర్యావరణ పరిస్థితులు, రాబందుల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యల కారణంగా దఖ్మా పద్ధతిలో అంత్యక్రియలు కష్టంగా మారింది. దీంతో సోలార్‌ లేదా విద్యుత్‌ విధానంలో దహన వాటికల్లోనే పార్సీలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నీరు, అగ్ని, నేల కాలుష్యం కాకుండా జొరాస్ట్రియన్‌ నియమాలకు అనుగుణంగానే అంతిమ సంస్కారాలు కొనసాగిస్తున్నారు.

5:39 PM, 10 Oct 2024 (IST)

  • ముంబయిలోని వర్లీ శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు
  • గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు
  • కేంద్ర ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరైన అమిత్‌ షా

4:01 PM, 10 Oct 2024 (IST)

  • ప్రారంభమైన రతన్‌ టాటా అంతిమయాత్ర
  • ముంబయి ఎన్‌సీపీఏ గ్రౌండ్‌ నుంచి వర్లి వరకు అంతిమయాత్ర
  • ముంబయి వర్లి శ్మశానవాటికలో రతన్ టాటా అంత్యక్రియలు
  • అధికారిక లాంఛనాలతో రతన్‌టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు

2:50 PM, 10 Oct 2024 (IST)

రతన్‌ టాటాకు నివాళులర్పించిన ముకేశ్‌ అంబానీ

రతన్​ టాటా పార్థివదేహానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ నివాళులు అర్పించారు.

2:36 PM, 10 Oct 2024 (IST)

దిగ్గజ పారిశ్రామికవేత్త​, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత రతన్ టాటా పార్థివదేహానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. ముంబయిలో జరగనున్న అంత్యక్రియల్లో కూడా పాల్గొనున్నారు.

12:29 PM, 10 Oct 2024 (IST)

రతన్​కు భారతరత్న

ఇండియన్ బిజినెస్ టైకూన్, దివంగత​ రతన్ టాటాకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహారాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది.

12:17 PM, 10 Oct 2024 (IST)

రతన్ ఆప్యాయతను మరిచిపోలేను : అడ్వాణీ

భారతరత్న, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్​కే అడ్వాణీ - రతన్​ టాటాకు నివాళులు అర్పించారు. 'ఈ ఏడాది ఫిబ్రవరిలో రతన్ టాటాతో చివరిసారి మాట్లాడాను. నాకు భారతరత్న వచ్చినందుకు ఆయన అభినందనలు తెలియజేస్తూ లేఖ రాశారు. ఆయన ఆప్యాయత, దాతృత్వం, దయా గుణం చాలా గొప్పవి' అని అడ్వాణీ కొనియాడారు.

12:02 PM, 10 Oct 2024 (IST)

రతన్​ టాటాకు బిర్లా నివాళులు

ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో రతన్‌ టాటా పార్థివదేహం ప్రజల సందర్శనార్థం ఉంచారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య బిర్లా గ్రూప్​ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన కుమార్తె అనన్య బిర్లా - రతన్​ టాటాకు అంతిమ నివాళులు అర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్‌ టాటా అంతిమయాత్ర నిర్వహిస్తారు. తరువాత ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహిస్తారు.

11:40 AM, 10 Oct 2024 (IST)

రతన్​ టాటాను తలచుకుని తీవ్ర భావోద్వేగానికి గురైన పీయూష్​ గోయల్​

రతన్ టాటా గురించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో గడిపిన క్షణాలను తలచుకున్నారు. "రతన్ టాటాతో మేము గడిపిన క్షణాలు మరిచిపోలేను. ఆయనతో అల్పాహారం తీసుకున్న జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకువస్తున్నాయి. ఆయన ఎంతో దయాద్రహృదయం కలవారు. ఆయనను 140 కోట్ల మంది భారతీయులతో పాటు ప్రపంచమంతా ప్రేమిస్తుంది" అని ఆయన అన్నారు.

11:33 AM, 10 Oct 2024 (IST)

టైటాన్​ను కోల్పోయాం - నేపాల్ ప్రధాని

రతన్‌ టాటా మృతి పట్ల నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ సంతాపం వ్యక్తం చేశారు. ఒక నిజమైన టైటాన్‌ను కోల్పోయామని ఆయన పేర్కొన్నారు.

11:26 AM, 10 Oct 2024 (IST)

రతన్ టాటా ఒక గొప్ప సహనశీలి : సుధామూర్తి

రతన్‌ టాటా మృతి పట్ల ప్రముఖ రచయిత్రి, దాత, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా ఎంతో సహనశీలురని, ఇతరుల పట్ల ఆయన ఎంతో కరుణతో ఉండేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆయన మరణించడం తనకు వ్యక్తిగతంగా ఎంతో లోటుగా అనిపిస్తోందని ఆమె అన్నారు.

10:49 AM, 10 Oct 2024 (IST)

మెరుగైన ప్రపంచం కోసం!

రతన్ టాటా మరణం పట్ల మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్​, సీఈఓ అనీష్​ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'రతన్ టాటా దృష్టి కేవలం వ్యాపారం మాత్రమే లేదు. ఆయన అంతకు మించి పనిచేశారు. కొత్త తరం వ్యాపారవేత్తలకు వ్యాపార ఉద్దేశాన్ని, సమగ్రతను నిర్దేశిస్తూ వారిని ప్రేరేపించారు' అని ఆయన 'ఎక్స్' వేదికలో ఓ పోస్ట్ పెట్టారు.​ రతన్ టాటా అడుగుజాడల్లో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.

10:32 AM, 10 Oct 2024 (IST)

గొప్ప దార్శనికుడిని కోల్పోయాం : ఇండియన్ అమెరికన్స్​

  • రతన్ టాటాకు భారతీయ అమెరికన్లు కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు. భారత అభివృద్ధికి, శ్రేయస్సుకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. దిగ్గజ టెక్నాలజీ కంపెనీ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్​ పిచాయ్​ 'ఎక్స్' వేదికగా రతన్​ టాటాకు ఘన నివాళులు అర్పించారు.
  • యూఎస్​-ఇండియా బిజినెస్​ కౌన్సిల్​ (USIBC) అధ్యక్షుడు అతుల్​ కేశప్​, భారతదేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని అన్నారు. రతన్ టాటా దాతృత్వానికి ఒక రోల్​ మోడల్​ అని కొనియాడారు.
  • టాటాల వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరించి, 'టాటా'ను ఒక గొప్ప బ్రాండ్​గా మార్చిన వ్యాపార దిగ్గజం రతన్​ టాటా 86 సంవత్సరాల వయస్సులో మరణించారు అని న్యూయార్క్ టైమ్స్​ రాసింది.

9:59 AM, 10 Oct 2024 (IST)

గొప్ప దార్శనికుడి కోల్పోయాం - బిర్లా

రతన్​ టాటా మృతితో భారతదేశం, దేశ పరిశ్రమ గొప్ప దార్శనికతను కోల్పోయాయని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్​ కుమార్​ మంగళం బిర్లా అన్నారు. దశాబ్దాలుగా టాటా, బిర్లా కుటుంబాలు అత్యంత సన్నిహితంగా కలిసిమెలసి ఉంటున్నాయని ఆయన అన్నారు. ఆదర్శ జీవితం గడిపిన రతన్​ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు బిర్లా తెలిపారు.

9:53 AM, 10 Oct 2024 (IST)

అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పార్థివ దేహాన్ని కోల్బాలోని ఆయన నివాసానికి తరలించారు. తరువాత ఎన్‌సీపీఏ గ్రౌండ్​కు ఆయనను తీసుకువెళ్లారు. ప్రజలు నివాళులు అర్పించడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు అంతిమ యాత్ర నిర్వహిస్తారు. తరువాత రతన్‌ టాటా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

9:28 AM, 10 Oct 2024 (IST)

ముంబయిలో జరగనున్న పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు సమాచారం. భారత ప్రభుత్వం తరపున టాటా భౌతికకాయానికి ఆయన నివాళులర్పించనున్నారు. ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ లావోస్‌కు వెళ్లనున్న నేపథ్యంలో షా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

8:41 AM, 10 Oct 2024 (IST)

దేశం కోసం జీవితం అంకితం!

రతన్‌ టాటాకు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు మొదలుకొని సినీ ప్రముఖులు వరకు అందరూ సంతాపం తెలియజేస్తున్నారు. దేశం కోసం తన జీవితాన్ని భారతదేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడుతున్నారు.

"భారతదేశ అభివృద్ధికి రతన్ టాటా తన జీవితాన్ని నిస్వార్థంగా అంకితం చేశారు. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ దేశం, ప్రజల అభ్యున్నతిపై ఆయన చూపించే నిబద్ధత నన్ను ఆశ్చర్యపరిచేది. ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ, మనందరి హృదయాలలో ఎప్పటికీ జీవించే ఉంటారు." - అమిత్‌ షా, కేంద్రహోం మంత్రి

"జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి రతన్‌ టాటా. ఆయన మరణవార్త విని ఎంతో బాధపడ్డాను. మూడు దశాబ్దాలుగా ఆయనతో వ్యక్తిగత, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. తన వ్యాపార చతురతకు అతీతంగా సమాజంలో ఎంతో మందిని ప్రభావితం చేసిన సామాజిక నాయకుడు’’.
- నితిన్‌ గడ్కరీ, కేంద్ర మంత్రి

రతన్‌ టాటా మృతికి అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంతాపం తెలిపారు. "భారత్‌ ఒక వ్యాపార దిగ్గజాన్ని, ఆధునిక మార్గాన్ని పునర్నిర్మించిన వ్యక్తిని కోల్పోయింది. ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు. కరుణ కలిగిన వ్యక్తి. ఆయన లాంటి లెజండ్‌కు మరణం లేదు"
- గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్​ ఛైర్మన్​

"రతన్‌ టాటా నైతికతలోను, నాయకత్వంలోను, దాతృత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. ఆయన వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన జ్ఞాపకాలు మనతో ఎప్పటికీ ఉంటాయి"
- హర్ష్‌ గోయెంకా, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌

"రతన్‌ టాటా దేశానికి ఎనలేని సేవలందించారు. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధిలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం".
- ఆనంద్‌ మహీంద్రా

"రతన్‌ టాటా భారతదేశం గర్వపడే వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను."
- ఉదయ్‌ సురేష్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వ్యవస్థాపకుడు

రతన్‌ టాటా మృతిపట్ల బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్‌, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, నటి ప్రియాంక చోప్రా సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌ నిజమైన కుమారుడిని, ఛాంపియన్‌ను కోల్పోయిందని ఏఆర్‌ రెహమాన్‌ పేర్కొన్నారు. 'రతన్‌ టాటా భావితరాలకు స్ఫూర్తిదాయకం, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలకు, దేశం పట్ల ఆయనకున్న అంకిత భావానికి ధన్యవాదాలు' అని ప్రియాంక చోప్రా అన్నారు.

7:55 AM, 10 Oct 2024 (IST)

రతన్‌ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు

రతన్‌టాటాకు సినీ ప్రముఖులు ఘన నివాళులర్పిస్తున్నారు. ఆయన్ని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

భారతీయులకు ఇది బాధాకరమైన రోజు. సేవలో రతన్‌టాటాను మించినవారు లేరు. మనదేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. మెగా ఐకాన్‌. నిజమైన పారిశ్రామిక వేత్త, పరోపకారి. అసాధారణ మానవుడు. టాటా బ్రాండ్‌లను గ్లోబల్‌ పవర్‌ హౌస్‌గా నిర్మించడమే కాకుండా.. మనదేశ నిర్మాణంలోనూ అద్భుతంగా కృషి చేశారు. మనం ఒక మంచి మనస్సున్న వ్యక్తిని కోల్పోయాం. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు తరాలకు స్ఫూర్తినిస్తాయి.. మార్గాన్ని నిర్దేశిస్తాయి. రతన్‌ టాటా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా
- చిరంజీవి

"రతన్‌ టాటాది బంగారంలాంటి హృదయం. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. దూరదృష్టి గల వ్యక్తి. ఎంతోమంది జీవితాలను మార్చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను"
- జూనియర్​ ఎన్టీఆర్‌

"రతన్‌టాటా ఓ లెజెండ్‌. మన హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. టాటా ఉత్పత్తులను ఉపయోగించని రోజును ఊహించుకోవడం కష్టం. ఎన్నోతరాలకు స్ఫూర్తి. పంచ భూతాలతో పాటు ఆయన కూడా ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన ఆరాధకుడినే. జైహింద్‌" - రాజమౌళి, తెలుగు సినిమా దర్శకులు

"ఒక పరోపకారి. లక్షలాది మందికి ఆశాజ్యోతి. ఎంతోమందికి స్ఫూర్తి. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంతో కృషి చేశారు. అలాంటి గొప్ప మనిషి మరొకరు ఉండరు. ఆయన ఇక లేరని ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంటోంది. మిస్‌ యూ సర్‌. ఓం శాంతి"
- ఖుష్బూ

7:16 AM, 10 Oct 2024 (IST)

భారతదేశ ముద్దుబిడ్డను కోల్పోయాం: కాంగ్రెస్​

రతన్‌ టాటా మృతికి కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. వ్యాపారం, దాతృత్వంలో చెరగని ముద్ర వేసి వెళ్లిపోయారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. రతన్‌ టాటా కుటుంబానికి, టాటా గ్రూప్‌నకు ‘ఎక్స్‌’లో సంతాపం తెలిపారు. టాటా మరణంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే విచారం తెలియజేశారు. దేశం తన ముద్దుబిడ్డను కోల్పోయిందని ఆయన అన్నారు. రతన్‌ టాటా కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని, ఆయన దేశ నిర్మాణానికి వెలలేని సహకారం అందించారని కొనియాడారు.

7:09 AM, 10 Oct 2024 (IST)

స్ఫూర్తి ప్రదాత

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్​, రతన్​ టాటా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారరంగంలో రతన్ టాటా అసాధారణమైన సేవలు అందించారని పేర్కొన్నారు.

7:08 AM, 10 Oct 2024 (IST)

మీ ఆత్మకు శాంతి కలగాలి

రతన్ టాటా మృతి వార్తతో పారిశ్రామికవేత్తలు అందరూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిలషించారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్​ ఆనంద్ మహీంద్రా సహా పలువురు భారతీయ పారిశ్రామిక వేత్తలు రతన్​ టాటాకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రతన్‌ టాటా లేరన్నది నేను అంగీకరించలేకపోతున్నానని ఆనంద్‌ మహీంద్రా అన్నారు. మన దేశ ఆర్థిక సంపదకు, విజయాలకు ఆయన సేవలు ఎంతగానే ఉపయోగపడ్డాయని కొనియాడారు.

7:00 AM, 10 Oct 2024 (IST)

దాతృత్వంలో శాశ్వత ముద్ర : రాహుల్‌ గాంధీ

రతన్‌ టాటా మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్‌ టాటా శాశ్వత ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

6:55 AM, 10 Oct 2024 (IST)

ఘన నివాళి

రతన్‌ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిగ్గజ వ్యాపారవేత్తకు నివాళి అర్పిస్తూ గురువారాన్ని సంతాప దినంగా ప్రకటించింది. అలాగే రతన్‌ టాటా మృతికి సంతాపం తెలుపుతూ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ గురువారం సంతాప దినం ప్రకటించారు.

6:42 AM, 10 Oct 2024 (IST)

మోదీ సంతాపం

రతన్‌ టాటా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రతన్‌ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని, ఎంతో దయగల అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. భారత్‌లోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వం అందించారని, మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు.

6:40 AM, 10 Oct 2024 (IST)

రతన్​ టాటా ఒక గొప్ప మార్గదర్శి

రతన్‌ టాటా మృతిపట్ల ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సంతాపం వ్యక్తం చేశారు. అత్యున్నతమైన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు ఆయన మార్గదర్శి అని అన్నారు.

6:36 AM, 10 Oct 2024 (IST)

రాష్ట్రపతి సంతాపం

రతన్‌ టాటా మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌ ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తను కోల్పోయిందన్నారు. ఆయన చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆమె కొనియాడారు.

Last Updated : Oct 10, 2024, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.